చిరంజీవి అభిమానుల రక్తదానం | - | Sakshi
Sakshi News home page

చిరంజీవి అభిమానుల రక్తదానం

Aug 22 2026 1:47 AM | Updated on Aug 22 2026 1:47 AM

పర్లాకిమిడి: స్థానిక జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆస్ప త్రిలో మెగస్టార్‌ చిరంజీవి ఫ్యాన్స్‌ వెల్ఫేర్‌ అసో సియేషన్‌ పర్లాకిమిడి శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం ఉచిత రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశా రు. ఒడిశా రాష్ట్ర కార్యదర్శి అలిజింగా రాము ఆధ్వర్యంలో శిబిరం జరిగింది. శనివారం చిరంజీవి పుట్టినరోజును పురస్కరించుకుని నిర్వహించిన శిబిరంలో ఏడు యూనిట్ల రక్తాన్ని సేకరించి బ్లడ్‌బ్యాంక్‌కు అందజేశారు. కార్యక్రమంలో బ్లడ్‌ బ్యాంక్‌ సీనియర్‌ ఫార్మసిస్టు బెహారా, చిరంజీవి అభిమానులు సంగా రాము, ధర్మ, శ్యామ్‌, జీవ, క్రిష్ణ, కిరణ్‌, అభి పాల్గొన్నారు.

రిసోర్స్‌ టీచర్లకు వర్క్‌షాప్‌

మల్కన్‌గిరి: జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయం ఆధ్వర్యంలో మల్కన్‌గిరిలోని పీఎంశ్రీ నోడల్‌ ఉన్నత పాఠశాలలో 50 మంది రిసోర్స్‌ టీచర్లకు జిల్లాస్థాయి వర్క్‌షాప్‌ను శుక్రవారం నిర్వహించారు. జిల్లా విద్యాశాఖ అధికారి చిత్తరంజాన్‌ పాణిగ్రాహి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాణ్యమైన విద్యను అందించడంతో పాటు సహపాఠ్య కార్యక్రమాలను విజయవంతంగా అమలు చేయడంలో రిసోర్స్‌ టీచర్ల పాత్ర ఎంతో కీలకమన్నారు. కార్యక్రమంలో జిల్లా అదనపు విద్యాధికారి మంజులత బోయి, భగీరథీ బెహరా, కలిమెల సమితి విద్యాధికారి రమేశ్‌ బారోయి, మల్కన్‌గిరి సమితి విద్యాధికారి మమతా సోయ్‌ తదితరులు పాల్గొన్నారు.

పోగొట్టుకున్న సెల్‌ఫోన్లు అందజేత

మల్కన్‌గిరి: జిల్లాలోని కలిమెల సమితి మోటు పోలీసులు శుక్రవారం ఐదు సెల్‌ఫోన్లు పోగొట్టుకున్న యజమానులకు అందజేశారు. కలిమెల మోటు ప్రాంతానికి చెందిన ఐదుగురి సెల్‌ఫోన్లు దొంగతనానికి గురైనట్లు పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదులు నమోదయ్యాయి. వీటిని దర్యాప్తు చేసిన పోలీసులు పట్టుకొని, యజమానులకు అప్పగించారు.

రైలు మార్గాల నిర్మాణానికి

భూమి అప్పగింత

జయపురం: జయపురం నుంచి మల్కన్‌గిరి, జయపురం– నవరంగపూర్‌ నూతన రైలు మార్గాల నిర్మాణం కోసం జయపురం సబ్‌డివిజన్‌ కుంద్ర తహసీల్దార్‌ 37 ఎకరాల 98 డిస్మల్‌ భూమిని సమకూర్చుతూ అందుకు అవసరం అయిన దస్తావేజులను, పట్టాలను రైల్వే అధికారులకు అందజేశారు. కుంద్ర తహసీల్దార్‌ బినోద్‌ కుమార్‌ నాయిక్‌ వివరణ ప్రకారం అందులో దిగాపూర్‌ రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌ సర్కిల్‌ ఘుమర లో 24 ఎకరాల 71 డిస్మల్‌ భూమిని, హటకుడిపిలో 13 ఎకరాల 27 డిస్మల్‌ భూమిని మొత్తం 37 ఎకరాల 98 డిస్మల్‌ భూమిని రైల్వే అధికారులకు అందజేసినట్లు వెల్లడించారు. కుంద్ర తహసీల్దార్‌ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో భూమిని సమకూర్చిన 209 మంది పట్టాదారుల్లో 163 మందికి నష్ట పరిహారం చెల్లించారు. కుంద్ర తహశీల్‌ ఆధీనంలో గల ఘుమర, హటకుడిపి, దిగాపూర్‌ ఘొసర్డ, ఖిలపుట్‌, ప్రధానపుట్‌, ముండిగుడ మొదలగు మొదలగు గ్రామాల్లో రైల్వే ప్రాజెక్టుల కోసం భూములు గుర్తించినట్లు తెలిపారు. మిగతా పట్టాదారులు భూమి ధర పెంచాలని డిమాండ్‌ చేస్తున్నారని, పరిహారం పెంచిన తరువాతనే భూములను అప్పజెబుతామని అంటున్నారని వెల్లడించారు. నెల రోజుల్లో ఆ సమస్య పరిష్కారమవుతుందని తెలిపారు. కార్యక్రమంలో అదనపు తహసీల్దార్‌ అశోక్‌ కుమార్‌ పాల్‌, రెవెన్యూ సూపర్‌వైజర్‌ బీరేంధ్ర కుమార్‌ మండల్‌, దిగాపూర్‌ రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌ జయంతీ మఝి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement