రాయగడ: జిల్లాలోని గుణుపూర్ సబ్ డివిజన్ పరిధిలో గల పుటాసింగ్ పోలీస్ స్టేషన్ టొలనా ఘాటీ మలుపులో ఒక పికప్ వ్యాన్ బోల్తా పడిన ఘటనలో 18 మంది గాయాలు పాలయ్యారు. ఇందులో పది మంది పరిస్థితి ఆందోళనకరంగా ఉండడంతో మెరుగైన చికిత్స కోసం తరలించారు. శుక్రవారం జరిగిన ఈ ఘటనకు సంబంధించి గాయాలపాలైన వారంతా సొగడ గ్రామానికి చెందిన వారేనని పోలీసులు తెలియజేశారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని క్షతగాత్రులను గుణుపూర్ సబ్ డివిజన్ హస్పటల్ కు చికిత్స కోసం తరలించారు. అనంతరం మరో పది మందికి మెరుగైన చికిత్స కోసం బరంపురానికి తరలించినట్లు సమాచారం. శుక్రవారం ఉదయం సొగడ ప్రాంతానికి చెందిన 18 మంది ఒక పికప్ వ్యాన్‌లో వ్యవసాయ కూలి పనులకు సంబంధించి పద్మపూర్‌లోని డొకాసికుల ప్రాంతానికి వెళుతున్న సమయంలో వ్యాన్ టొలన ఘాటీ వద్ద అదుపు తప్పి బోల్తా పడింది.


