జయపురం: నేరాలను అరికట్టేందుకు, పట్టణంలో శాంతి భధ్రతల పరిరక్షణకు జయపురం పో లీసు యంత్రాంగం కృత నిశ్చయంతో చర్యలు చేపడుతోంది. అందులో భాగంగా జయపురం, బొరిగుమ్మ, కొట్‌పాడ్, నవరంగపూర్ తదితర ప్రాంతాల్లో హత్యా ప్రయత్నాలు, దాదాగిరి, దోపిడీలు, చట్టవిరుద్ధంగా మారణాయుధాలు, మత్తు పదార్థాల సరఫరా మొదలగు 25 కేసులతో సంబంధాలు కలిగి ఉన్న నిందితుడు సంజయ సున పై ఎన్.ఎస్.ఎ చట్టం, సెక్షన్ 3(2) కింద కేసు నమోదు చేశారు. రానున్న రోజులలో పట్టణంలో నేరాలు అరికట్టేందుకు రాత్రి పెట్రోలింగ్ మరింత బలోపేతం చేయనున్నట్లు జయపురం సబ్‌డివిజనల్ పోలీసు అధికారి అర్చిత మిత్తల్ వెల్లడించారు.
భారీగా గంజాయి పట్టివేత
మల్కన్‌గిరి: జిల్లాలోని మత్తిలి సమితి దురుగాజోడి బ్రిడ్జి సమీపంలో పోలీసులు అక్రమ రవాణాకు సిద్ధం చేసిన గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. రవాణాదారులు పోలీసుల రాకను గమనించి తమ ద్విచక్ర వాహనాలను వదిలి సమీప అడవిలోకి పరారయ్యారు. అనంతరం పట్టుకున్న గంజాయిని పోలీసుస్టేషన్‌కు తరలించారు. అక్కడ ఐఐసీ దీపాంజలి ప్రదాన్ సమక్షంలో తూకం వేయగా 112 కిలోలు ఉంది. మార్కెట్లో దీని విలువ సుమారు రూ.10 లక్షలు వరకు ఉంటుందని తెలిపారు. పరారైన నిందితులు కోసం గాలిస్తున్నారు.


