రాయగడ: మారుమూల గ్రామాలకు మొబైల్ కనెక్టివిటీ కల్పించాలన్న కేంద్ర ప్రభుత్వ డిజిటల్ భారత్ నిధి (డీబీఎన్) లక్ష్యానికి రహదారుల లేమి అడ్డంకిగా మారింది. జిల్లాలో రోడ్లు సదుపాయం లేకపొవడంతో ఏకంగా 16 మోబైల్ టవర్లను ఏర్పాటు చేయలేని పరిస్థితి నెలకొంది. టవర్ల నిర్మాణానికి అవసరమైన సామగ్రి, బేస్ ట్రాన్స్‌రివర్ స్టేషన్ (బీటీఎన్) పరికరాలను సంబంధిత ప్రాంతాలకు తరలించేందుకు రహదారి లేకపొవడంతో పనులు నిలిచిపోయాయి. డిజిటల్ భారత్ నిధి పథకం కింద నిర్మిస్తున్న టవర్ల పరిస్థితిపై ప్రాజెక్టు పింప్లిమెంటింగ్ ఏజెన్సీ (పీఐఏ) కేంద్ర టెలికాం శాఖకు నివేదిక సమర్పించింది. దీంతో కేంద్ర ప్రభుత్వం ఈ అంశంపై దృష్టి సారించింది. రహదారుల పరిస్థితి, పనుల పూర్తి చేయడానికి తీసుకోవాల్సిన చర్యలపై జిల్లా కలెక్టర్‌కు రాష్ట్ర ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖ ప్రత్యేక కార్యదర్శి ప్రదీప్ కుమార్ రౌత్ లేఖ రాశారు.
కాసీపూర్‌లోనే అత్యధిక గ్రామాలు
జిల్లాలో డీబీఎన్ పథకం కింద మొబైల్ టవర్లు ఏర్పా టు చేయాల్సిన గ్రామాల్లో అత్యధికంగా కాసీపూర్ సమితికి చెందినవే ఉన్నాయి. కాసీపూర్‌లొని డెరంజా, ఖారీకణ,ఒడాజల్, లేఖపాయి, మాలీపదర్, పెరెగ్, టికర్‌ధూలిగుడ, మాండితునేషా, కంచాముంహి, సమేరా గ్రామాల్లొ రహదారుల సదుపాయం లేక టవర్లు ఏర్పటుకు ఆటంకం ఏర్పడింది. నీతా ఆయోగ్ ఆశావాహ సమితిగా గుర్తించిన మునిగుడ ప్రాంతలొనూ ఇదే పరిస్ధితి నెలకొంది. మునిగుడ సమితిలొని ధమునిపొంగ, సనకందులపాడు గ్రా మాల్ల్లో కూడా రహదారి సమస్య కారణంగా ప్రతి పాదిత మోబైల్ టవర్ల పనులు ముందకు సాగడం లేదు. అదేవిధంగా జిల్లాలొని బిసంకటక్ సమితి లొని కొండాబాలిగాం, గుడారి సమితిలొని గునుజుగుడా, కళ్యాణసింగుపూర్ సమితిలొని కొలేటి, రాయగడ సమితిలొని టుడులెలెరి గ్రామాల్లొనూ రహాదారి సమస్య టవర్ల నిర్మాణానికి అడ్డంకిగా మారింది.
ప్రధాన కార్యదర్శికి లేఖ
రహదారి సదుపాయం లేక టవర్ల నిర్మాణం ఆలస్యం అవుతున్న విషయాన్ని పీఐఏ కేంద్ర టెలికాం శాఖకు నివేదించింది. దీంతో కేంద్ర టెలికాం డైరెక్టర్ జనరల్ ఆనంద్ ఖరా గత నెలలో ఒడిశా ప్రబుత్వ ప్రధాన కార్దర్శికి ఈ అంశాన్ని తెలియజేస్తు లేఖ రాసారు. అనంతరం కేంద్ర టెలికాం కార్యదర్శి సంబంధిత జిల్లా ల కలెక్టర్‌కు రహదారి పరిస్ధితిపై తక్షణ నివదిక ఇవ్వాలని ఆదేశించారు. టవర్ల నిర్మాణానికి రహదారి ఏర్పాటు చేయగల ప్రాంతాలు, రహదారి నిర్మాణం సాధ్యం కాని ప్రాంతాల వివరాలను ప్రత్యేకంగా తెలియజేయాలని సూచించారు.
రహదారి వస్తేనే టవర్
రహదారి ఏర్పాటు సాధ్యమయ్యే ప్రాంతాల్లొ నిర్ణీత కాల వ్యవధిలొ రహాదారి పనులు పూర్తి చేసి మోబైల్ టవర్ల నిర్మాణానికి మార్గం సుగమం చేయాలని కేంద్రం సూచించింది. రహదారి ఏర్పటు చేయడం సాధ్యం కాని ప్రాంతాల్లొ ప్రతిపాదిత టవర్లను ప్రస్తుతానికి నిలిపివేసి, భవిష్యత్‌లొ రాకపొకలకు సదుపాయం కల్పించిన అనంతరం టవర్లను ఏర్పాటు చేయాలని స్పష్టం చేసింది.
9 జిల్లాల్లో 71 గ్రామాలకు సమస్య
డిజిటల్ భారత్ నిధి (డీబీఎన్) పథకం కింద రాయగడతో పాటు కొరాపుట్, మల్కనగిరి, కలహండి, కంధమాల్, గజపతి, గంజాం, ఖుర్ధా, కేంఝర్ జిల్లాల్నొ మొత్తం 71 గ్రామాల్లో రహదారి సమస్య కారణంగా మోబైల్ టవర్ల ఏర్పాటుకు ఆటకంకం ఏర్పడినట్లు సమాచారం. ఈ గ్రామాల్లొ రహదారి పరిస్ధితిపై సంబంధిత జిల్లా కలెక్టర్లు తక్షణం నివేదిక సమర్పించాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. మారుమూల గ్రామాలకు డిజిటల్ కెన్టివిటీ అందించాలంటే ముందుగా రహదారి సౌకర్యం కల్పించాల్సిన అవసరం మరొసారి స్పష్టమవుతుంది.


