మద్యం ప్రియులపై కొరడా! | - | Sakshi
Sakshi News home page

మద్యం ప్రియులపై కొరడా!

Aug 22 2026 1:47 AM | Updated on Aug 22 2026 1:47 AM

గుణుపూర్‌ సబ్‌ కలెక్టర్‌ ఆకస్మిక తనిఖీలు

రాయగడ: గుణుపూర్‌ పట్టణంతో పాటు పరిసర ప్రాంతాల్లోని ఆలయాలు, పర్యాటక ప్రాంతాలు మద్యం ప్రియులకు అడ్డాలుగా మారుతున్నాయన్న ఫిర్యాదులపై అధికారులు కఠిన చర్యలకు శ్రీకారం చుట్టారు. బహిరంగ ప్రదేశాల్లో మద్యం, ఇతర మత్తు పదార్ధాల వినియోగాన్ని అరికట్టేందుకు గుణుపూర్‌ సబ్‌ కలెక్టర్‌ దుదూల్‌ అభిషేక్‌దిలిప్‌ పోలీసులతో కలిసి ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. బహిరంగ ప్రదేశాలు, ఆలయాలు, పర్యాటక ప్రాంతాల సమీపంలో మత్తు పదార్ధాల వినియోగంపై ఆంక్షలు విధించిన అనంతరం సబ్‌ కలెక్టర్‌ దుదూల్‌ స్వయంగా రంగంలోకి దిగారు. పోలీసు బలగాలతో కలిసి సేఫాలి కొండ, కపిలపూర్‌, రైల్వేస్టేషన్‌, హల్దియా నాలో మైదానం, బాఘువా దేవాలయం వెను ప్రాంతం, గుండిచా ఆలయం సమీపంలోని మైదానం, పాత బస్టాండులోని మద్యం దుకాణ పరిసరాల్లో తనిఖీలు చేపట్టారు. తనిఖీల సమయంలో పలు చోట్ల మద్యం సేవిస్తు గుంపులుగా ఉన్న వ్యక్తులు పోలీసు బలగాలను చూసి అక్కడి నుంచి పరుగులు తీసారు. మరికొందరు మద్యం సేవిస్తు పట్టుబడ్డారు. వారిని సబ్‌ కలక్టర్‌ హెచ్చరించి వదిలిపెట్టారు. ఇకపైఔ ఇలాంటి చర్యలకు పాల్బడి పట్టుబడితే కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకొవాలని గుణుపూర్‌ ఐఐసి కేకేబికే కుహరోను ఆదేశించారు.

అక్రమ ఇసుక రవాణాపై నిఘా

మద్యం సేవించే వారిపై మాత్రమే కాకుండా అక్రమ ఇసుక రవాణాపైనీ సబ్‌ కలెక్టర్‌ దృష్టిసారించారు. అర్ధరాత్రి గుణుపూర్‌,పెంగుడా, గుముడా ప్రాంతాల్లోని ఇసుక రీచ్‌లను ఆకస్మికంగా సందర్శించి పరిస్థితిని సమీక్షించారు. ఇసుక అక్రమ రవాణా జరుగుతోందో అనే కొణంలొ తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లొ సబ్‌ కలక్టర్‌తొ పాటు డిప్యూటీ కలెక్టర్‌ శుబ్రఽనాధ్‌ రౌత్‌, అదనపు తహసీల్దార్‌ అభిషేక్‌ శతపతి, పోలీసు అధికా్‌ురలు పాల్గొన్నారు.

విద్యా ప్రమాణాలు పెరగాలి

శ్రీకాకుళం రూరల్‌ : విద్యా ప్రమాణాలు పెంచేందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలని ప్రిన్సిపల్‌ సెక్రటరీ ఎంఎం నాయక్‌, కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌, జాయింట్‌ కలెక్టర్‌ ఫర్మాన్‌ అహమ్మద్‌ ఖాన్‌ అన్నారు. గురువారం పెదపాడులోని డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ గురుకులాన్ని సందర్శించారు. విద్యార్థులతో కలిసి సహపంక్తి భోజనం చేశారు. వసతులు, విద్యాభ్యాసం, ఇతరత్రా కార్యకలాపాలపై ఆరా తీశారు. ఏటీఎల్‌ ల్యాబ్‌ను సందర్శించి విద్యార్థుల్లో సృజనాత్మకత, శాసీ్త్రయ ఆలోచనా విధానం, నూతన ఆవిష్కరణలను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో అసిస్టెంట్‌ కలెక్టర్‌ హరిఓం పాండ్యా, శ్రీకాకుళం ఆర్డీవో ప్రత్యూష, టెక్కలి ఆర్డీవో కృష్ణమూర్తి, డిప్యూటీ డైరెక్టర్‌ కె.వినాయకం తదితరులు పాల్గొన్నారు.

యువతకు ఉపాధి శిక్షణ

ఎచ్చెర్ల : మండలం కేంద్రం ఎచ్చెర్లలోని యూనియన్‌ బ్యాంక్‌ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థలో ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా యువతకు సెల్‌ఫోన్‌ సర్వీసింగ్‌లో ఉచిత శిక్షణా తరగతులు నిర్వహించనున్నామని సంస్థ డైరెక్టర్‌ రామ్‌జీ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 28 నుంచి శిక్షణ ప్రారంభమవుతుందని చెప్పారు. ఉచిత వసతి, భోజన సదుపాయాలు కల్పిస్తామని పేర్కొన్నారు. పూర్తి వివరాలకు 9553410809, 7993340407 నంబర్లను సంప్రదించాలని కోరారు.

బెల్లం ఊట, సారా నిల్వలు ధ్వంసం

కంచిలి: ఆంధ్రా–ఒడిశా సరిహద్దు గ్రామాల్లో రెండు రాష్ట్రాల ఎకై ్సజ్‌, పోలీస్‌సిబ్బంది సంయుక్తంగా శుక్రవారం దాడులు నిర్వహించారు. సోంపేట, కంచిలి మండలాలకు ఆనుకొని ఉన్న గొంగాపూర్‌, రామచంద్రపూర్‌ గ్రామాల సరిహద్దులో నిల్వ ఉంచిన బెల్లం ఊటలు, నాటుసారా తయారీ కేంద్రాలను ధ్వంసం చేశారు. ఆయా గ్రామాల్లో సారా తయారీకి సిద్ధంగా ఉంచిన 7600 లీటర్ల పులియబెట్టిన బెల్లం ఊట, రవాణా చేయడానికి సిద్ధంగా ఉన్న 380 లీటర్లు నాటుసారాను ధ్వంసం చేశారు. ఈదాడుల్లో సోంపేట, పలాస, కోటబొమ్మాళి టాస్క్‌ఫోర్స్‌, ఎన్‌ఫోర్స్‌మెంట్‌, సిబ్బంది, అసిస్టెంట్‌ ఎకై ్సజ్‌ సూపరింటెండెంట్‌ కుమార్‌, మురళీధర్‌, సోంపేట ఎకై ్సజ్‌ సీఐ జి.వి.రమణ, పలాస సీఐ మల్లికార్జునరావు, టాస్క్‌ఫోర్స్‌ సీఐ మధుకుమార్‌, సిబ్బంది, ఒడిశా పోలీసులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement