భువనేశ్వర్: రాష్ట్ర గవర్నర్ డాక్టర్ హరిబాబు కంభంపాటి శుక్రవారం సీఎస్‌ఐఆర్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మినరల్స్ అండ్ మెటీరియల్స్ టెక్నాలజీ (సీఎస్‌ఐఆర్ ఐఎమ్‌ఎంటీ) సందర్శించారు. ఈ సంస్థలో వివిధ పరిశోధన, సాంకేతిక ప్రదర్శన కార్యక్రమాలను పరిశీలించారు. ఈ సందర్శనలో భాగంగా పీజీఐఎం పైలట్ ప్లాంట్, ఖనిజ ప్రాసెసింగ్ పైలట్ ప్లాంటు పర్యటించారు. గవర్నర్‌తో హిందీ సలహా కమిటీ సభ్యుడు డాక్టర్ బిపిన్ కుమార్, సీఎస్‌ఐఆర్ ఐఎమ్‌ఎంటీ డైరెక్టరు డాక్టర్ రామనుజన్ నారాయణ్ సందర్శనలో పాల్గొన్నారు. గవర్నర్ డాక్టర్ హరి బాబు కంభంపాటి సీఎస్‌ఐఆర్ ఐఎంఎంటీ శాస్త్రవేత్తలు, పరిశోధకుల కృషిని అభినందించారు.


