మల్కన్‌గిరి: తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ అంగన్‌వాడీ కార్యకర్తలు కదంతొక్కారు. మల్కన్‌గిరి జిల్లా కేంద్రంలో సోమవారం ఇండియన్ వర్కర్స్ యునియన్ తరఫున మల్కన్‌గిరి జిల్లా కలెక్టర్‌కు వినతి పత్రాన్ని అందజేశారు. ముఖ్యంగా వేతనాలు పెంచాలని, ఆశ వర్కర్లకు ఒకరోజు సెలవు, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు జీతాలు పెంచాలని, పెరుగుతున్న నిత్యావాసర వస్తువుల ధరలకు అనుగుణంగా జీతాలు ఇవ్వాలని, అంగాన్‌వాడీ కార్యకర్తలను రెగ్యులర్ చేయాలని తదితర 12 డిమాండ్లతో వినతి పత్రాన్ని అందజేశారు. వందలాది మంది మహిళలు భారీ ర్యాలీగా కలెక్టర్ కార్యాలయానికి చేరుకొని తమకు న్యాయం చేయాలని నినాదాలు చేశారు.


