భార్యను చంపిన వ్యక్తికి జీవిత ఖైదు | - | Sakshi
Sakshi News home page

భార్యను చంపిన వ్యక్తికి జీవిత ఖైదు

Aug 18 2026 12:45 AM | Updated on Aug 18 2026 12:45 AM

పర్లాకిమిడి: గజపతి జిల్లా సెరంగో పోలీస్‌స్టేషన్‌ పరిధిలో 2022లో జరిగిన హత్య కేసులో సోమవారం జిల్లా షెషన్సు జడ్జి, జిల్లా జడ్జి జగదీష్‌ ప్రసాద్‌ మహంతి తీర్పు వెలువరించారు. సొంత కూతురు అస్వస్థతతో ఉన్నప్పుడు తండ్రి ఆస్పత్రికి తీసుకెళ్లకుండా నిర్లక్ష్యం చేసినందుకు భార్య నిలదీయంతో వాగ్వాదం జరిగింది. ఇది భార్య హత్యకు దారి తీసింది. ఈ కేసును విచారించిన జడ్జి నిందితుడు కుడిగోండ గ్రామనివాసి ఇలుందళ బెహారా(62)ను దోషిగా నిర్ధారించారు. అతనికి జీవిత ఖైదుతోపాటు రూ.15వేల జరిమానా విధించారు. ఒక వేళ జరిమానా కట్టకపోతే ఎడల మరో ఆరునెలలు కారాగార శిక్ష పొడిగించాలని తీర్పులో వెల్లడించారు. ఈ కేసును సీనియర్‌ పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ రాజేష్‌ కుమార్‌ మిశ్రా పర్యవేక్షించగా, అదనపు పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ మండల లోకనాథం సహకారం అందజేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement