వరకట్న వేధింపులకు పాల్పడితే జైలే.. | - | Sakshi
Sakshi News home page

వరకట్న వేధింపులకు పాల్పడితే జైలే..

Aug 13 2026 12:45 AM | Updated on Aug 13 2026 12:45 AM

మల్కన్‌గిరి: వరకట్న వేధింపులకు పాల్పడడం చట్టరీత్యా నేరమని అధికారులు హెచ్చరించారు. మల్కన్‌గిరి జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో స్థానిక జిల్లా పరిషత్‌ సమావేశ మందిరంలో వరకట్న నిషేధ చట్టం–1961పై జిల్లా స్థాయి శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ శాకల అధికారులు మాట్లాడుతూ.. వరకట్న వ్యవస్థ నిర్మూలన, మహిళల హక్కులు, భద్రతపై అవగాహన అవసరమన్నారు. వరకట్నం ఇవ్వడం, తీసుకోవడం వల్ల కలిగే చట్టపరమైన పరిణామాలు, వరకట్న నిర్మూలనలో అధికారుల పాత్ర, బాధ్యతలు, వరకట్నానికి సంబంధించిన ఫిర్యాధుల ప్రక్రియ, న్యాయ సహాయం, వివాహ నమోదు తదితర అంశాలపై విస్తృతంగా చర్చించారు. అదేవిధంగా వరకట్న రహిత సమాజ నిర్మాణంలో పోలీసుశాఖ, విద్యాసంస్థలు, మతపెద్దలు, స్వయం సహాయక సంఘాలు, సామాజిక సంస్థలు చురుకై న పాత్ర పోషించాల్సిన అవసరం ఉందన్నారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్‌ ప్రధమేశ్‌ అర్వింద్‌ రాజశిర్కే ముఖ్య అతిథిగా మాట్లాడుతూ.. వరకట్న వేధింపులకు పాల్పడేవారికి కఠిన శిక్షలు అమల్లో ఉన్నాయన్నారు. ఈ జాఢ్యాన్ని పూర్తిగా నిర్మూళించాల్సిన అవసరం ఉందన్నారు. సబ్‌కలెక్టర్‌ దుర్యోధన్‌ బోయి, జిల్లా అదనపు ప్రజా ఆరోగ్య అధికారి నీలమణి తిలక్‌ చంద్‌ బెహర, పలు కళాశాలల విద్యార్థులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement