సెంచూరియన్‌లో రిమోట్‌ సెన్సింగ్‌ డే | - | Sakshi
Sakshi News home page

సెంచూరియన్‌లో రిమోట్‌ సెన్సింగ్‌ డే

Aug 13 2026 12:45 AM | Updated on Aug 13 2026 12:45 AM

పర్లాకిమిడి: జాతీయ రిమోట్‌ సెన్సింగ్‌ దినోత్సవాన్ని ఆర్‌.సీతాపురం సెంచూరియన్‌ వర్సిటీలోని ఓపెన్‌ ఆడిటోరియంలో ఇంజినీరింగ్‌ స్కూల్‌, సివిల్‌ ఇంజినీరింగ్‌, మెషీన్‌ లెర్నింగ్‌, సివిల్‌ ఇంజినీరింగ్‌ విభాగాల ఆధ్వర్యంలో బుధవారం ఘనంగా జరుపుకున్నారు. ఈ సమావేశానికి ఎన్‌ఆర్‌ఎస్‌సీ (జాతీయ రిమోట్‌ సెన్సింగ్‌ సెంటర్‌) మాజీ వైజ్ఞానికులు, ఇస్రో మాజీ సైంటిస్టు డాక్టర్‌ ఏటీ జయసేలన్‌ జ్యోతిని వెలిగించి ప్రారంభించారు. ఇతర అతిథులుగా చీఫ్‌ సైంటిస్టు డాక్టర్‌ పి.రాజా డీన్‌, సోయెట్‌, డాక్టర్‌ ప్రఫుల్ల కుమార్‌ పండా, రిజిస్ట్రారు డాక్టర్‌ అనితా పాత్రో, డైరక్టర్‌ (అడ్మిన్‌) డాక్టర్‌ దుర్గాప్రసాద్‌ పాఢి, ముఖ్యవిభాగం హెడ్‌ బి.విక్రం నారాయణన్‌ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వైజ్ఞానికులు ఏటీ జయసేలన్‌ మాట్లాడుతూ భూపరిశీలన సాంకేతికత, భారతీయ ఖగోళశాస్త్ర ప్రోగ్రాంలో చేపట్టిన జియోస్పేస్‌ రిమోట్‌ సెన్సింగ్‌ ద్వారా భూమిపై వర్షాధారం, మట్టికి సంబంధమైన పరిశోధన అప్పట్లో చేపట్టామని తన అభిప్రాయాలు పంచుకున్నారు. ముఖ్య వైజ్ఞానికులు పి.రాజా మాట్లాడుతూ, జియో స్పెషల్‌ టెక్నాలజీ ద్వారా వ్యవసాయం, పంటలు, భూవాతావరణం ముందుగానే పసికట్టగలిగే సామర్థ్యం భారత దేశ స్పేస్‌ ఇంజినీరింగ్‌ వ్యవస్థ కలిగి ఉందన్నారు. కార్యక్రమంలో అధ్యాపకులు, పరిశోథకులు, విద్యార్ధుల బృందం పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement