సోంపేట: రాష్ట్ర మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు బెయిల్ కోసం 3వ సారి సోంపేట కోర్టులో న్యాయవాది సోమవారం పిటిషన్ వేశారు. గత రెండుసార్లు న్యాయమూర్తి డిస్మిస్ చేయడంతో మూడోసారి వేయడం జరిగిందని పేర్కొన్నారు. మంగళవారం న్యాయమూర్తికి వాదనలు వినిపించనున్నట్లు తెలియజేశారు.
హిరమండలం: వైఎస్సార్‌సీపీ రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ సభ్యురాలు, మాజీ ఎమ్మెల్యే రెడ్డి శాంతి కుమార్తె రెడ్డి వేదిత (ఏజీఎంయూటీ) 2015 బ్యాచ్ ఐఏఎస్ అధికారిగా ఉండి ప్రస్తుతం ఢిల్లీ ప్రభుత్వంలోని మహిళ, శిశు అభివృద్ధి (డబ్ల్యూసీడీ) శాఖ ప్రత్యేక కార్యదర్శిగా అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు. కీలకమైన బాధ్యతలు స్వీకరించిన వేదిత రెడ్డికి పాతపట్నం నియోజకవర్గ ప్రజాప్రతినిధులు, అధికారులు, నాయకులు అభినందనలు తెలియజేశారు.
శ్రీకాకుళం పాతబస్టాండ్: సమాజంలో పేదలు, బలహీన వర్గాలకు ఉచిత న్యాయ సహాయం అందించడంలోనూ, క్షేత్ర స్థాయిలో చట్టాలపై ప్రజలకు చైతన్యం తేవడంలోనూ పారా లీగల్ వలంటీర్ల పాత్ర అత్యంత కీలకమైనదని జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి కె.హరిబాబు అన్నారు. జిల్లా కోర్టు ఆవరణలో సోమవారం పారా లీగల్ వలంటీర్లకు ప్రత్యేక క్రమబద్ధమైన శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాధితులకు న్యాయ విభాగానికి మధ్య వలంటీర్లు వారధిగా నిలవాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో భాగంగా వలంటీర్ల క్షేత్రస్థాయి కార్యకలాపాలు, పనితీరు మెరుగుదల, క్రమం తప్పకుండా అధికారులకు నివేదికలు సమర్పించే విధానాలపై క్షుణ్ణంగా అవగాహన పెంపొందించుకోవాలని సూచించారు.
మందస: మండలంలోని మత్స్యకార గ్రామమైన గెడ్డవూరు గ్రామానికి చెందిన కోడ బలరాం స్వామి తనయుడు కోడ దిజే ష్ జాతీయ స్థాయిలో మెరిశాడు. న్యూఢిల్లీలోని టాకటోరా ఇండోర్ స్టేడియంలో జరిగిన 20వ ఆల్ ఇండియా ఇండిపెండెన్స్ కప్ కరాటే చాంపియన్‌షిప్‌లో పాల్గొని కాంస్య పతకం సాధించాడు. కుమారు డి విజయంపై తండ్రితో పాటు కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు. ప్రస్తుతం బాలుడు అండమాన్‌లోని ఓ స్కూల్‌లో నాల్గో తరగతి చదువుతున్నాడు.
కంచిలి: పశుగ్రాసం పెంపకంతోనే పాడిరైతులకు మేలు కలుగుతుందని ఆత్మ ఏపీడీ డాక్టర్ ఎం.రవిక్రిష్ణ అన్నారు. గోకర్ణపురం, జె.నారాయణపురం గ్రామాల్లో ఆత్మ ఆధ్వర్యంలో పాడి రైతులకు అవగాహన సదస్సును సోమవారం నిర్వహించారు. ఇందులో పాడి రైతులకు పశుగ్రాసాల పెంపకం, వాడటం వల్ల ఉపయోగాలు, పీఎండీఎస్‌లో పశుగ్రాసాల సాగుతో కరువు పరిస్థితిలో కూడా పశు సంపదను కాపాడుకోవచ్చన్నారు. ఈ సందర్భంగా 200 పశువులకు ముద్ద చర్మపు వ్యాధి నివారణ టీకాలు వేశారు. సోంపేట పశువైద్య సహాయ సంచాలకులు డాక్టర్ కె.అప్పలస్వామి, మండల పశువైద్యాధికారిణి డాక్టర్ టి.శిరీష, సిబ్బంది హరీష్, రాజేష్, ప్రకృతి వ్యవసాయం సిబ్బంది శీర కామరాజు ఉన్నారు.
వజ్రపుకొత్తూరు రూరల్: ఉద్యమాలతోనే ఉపాధ్యాయుల హక్కుల సాధన సాధ్యమని యూటీఎఫ్ నాయకులు అన్నారు. వజ్రపుకొత్తూరులో సోమవా రం యూటీఎఫ్ 52వ ఆవిర్భావ దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా యూటీఎఫ్ జెండాను ఆవిష్కరించారు. అనంతరం పలువురు ఉపాధ్యా య సంఘ నాయకులు మాట్లాడుతూ యూటీఎఫ్ ఉపాధ్యాయుల సమస్యలపై నిరంతరం పోరాడు తుందని, పోరాట ఫలితంగా ఉపాధ్యాయుల హక్కులను, ప్రయోజనాలను సాధించామని గుర్తు చేశారు. కూటమి ప్రభుత్వం అనేక హామీలిచ్చి అధికారం చేపట్టి 2 ఏళ్లు దాటినా, ఉపాధ్యాయులకు ఇచ్చిన హామీలు నేరవెర్చలేదని విమర్శించారు. ఉపాధ్యాయ, ఉద్యోగులకు రూ.25 వేల కోట్లు బకాయిలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో యూటీఎఫ్ రాష్ట్ర నాయకులు గుంటు కోదండరావు, జిల్లా కార్యదర్శి కంచరానరమేష్, మండల శాఖ అధ్యక్షుడు రత్నాల సురేష్ కుమార్, సీనియర్ నాయకులు పైల సంజయ్‌కుమార్, ప్రధా న కార్యదర్శి చొక్కర ధర్మారావు, చంద్రశేఖర్, అనందరావు, శంకర్‌రావు, జయరాం, సుందరరావు, శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.


