పర్లాకిమిడి: పట్టణంలో సోమవారం ఉదయం 6 గంటల సమయంలో పోలీసులు పెట్రోలింగ్ చేస్తుండగా.. పోస్టాఫీసు సమీపంలోని బట్టగౌడో వీధి వద్ద ఓ యువకుడు బస్తాతో నిలబడి అనుమానాస్పదంగా కనబడటంతో సోదా చేయగా గంజాయి బయటపడింది. గంజాయితో పట్టుబడిన యువకుడు సదాశివ పాణిగ్రాహి (45)గా పోలీసులు గుర్తించారు. అనంతరం గంజాయిని తూకం వేసి సుమారు పదకోండు కిలోటు ఉంటుందని నిర్ధారించారు. నిందితుడు సదాశివ పాణిగ్రాహిని మోడల్ పోలీసు ష్టేషన్ అధికారులు అరెస్టు చేశారు. కేసు నమోదు చేసి కోర్టుకు తరలించారు. పెట్రోలింగ్ ఎస్‌ఐ ప్రపుల్ల జోగోరోంగో, పోలీసులు పాల్గొన్నారు.


