కొరాపుట్: స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురష్కరించుకొని కొరాపుట్, నబరంగ్‌పూర్ జిల్లాలో హర్ ఘర్ తిరంగా ర్యాలీలు సోమవారం సందడిగా జరిగాయి. నబరంగ్‌పూర్ జిల్లా కేంద్రంలో రాష్ట్ర ప్రాధమిక విద్య, సాంఘిక సంక్షేమ శాఖా మంత్రి నిత్యానంద గొండో ప్రారంభించారు. జిల్లా కేంద్రం మెయిన్ రోడ్డులో ర్యాలీ జరిగింది. మార్గమధ్యలో స్వాతంత్య్ర సమర యోధుల విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ మహేశ్వర్ స్వయ్, ఎమ్మెల్యే గౌరీ శంకర్ మజ్జి, బీజేపీ పరిశీలకురాలు పూర్ణిమా నాయక్ ఉన్నారు. కొరాపుట్ జిల్లా కేంద్రంలో భారీ ర్యాలీ జరిగింది. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ సత్యవాన్ మహాజన్, ఎమ్మెల్యే రఘురాం మచ్చో, జెడ్పీ ప్రెసిడెంట్ సస్మితా మెలక, మున్సిపల్ చైర్మన్ లలెటెందు రంజన్ శెఠి ఉన్నారు.


