రోగులకు ఇబ్బందులు లేకుండా చర్యలు | - | Sakshi
Sakshi News home page

రోగులకు ఇబ్బందులు లేకుండా చర్యలు

Aug 11 2026 1:48 AM | Updated on Aug 11 2026 1:48 AM

రోగులకు ఇబ్బందులు లేకుండా చర్యలు

శ్రీకాకుళం:

శ్రీకాకుళం రిమ్స్‌ సర్వజన ఆస్పత్రికి వైద్యం కోసం వచ్చే రోగులకు ఎటువంటి ఇబ్బందు లు లేకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌ ఆదేశించారు. మంగళవారం నుంచి జూనియర్‌ డాక్టర్లు, హౌస్‌ సర్జన్లు, పీజీ విద్యార్థులు సమ్మె చేసే అవకాశం ఉన్న నేపథ్యంలో కలెక్టర్‌ రిమ్స్‌ సూపరింటెండెంట్‌, ఇన్‌చార్జి ఆర్‌ఎంవో, అన్ని విభాగాధిపతులతో సమీక్ష సమావేశాన్ని సోమవారం నిర్వహించారు. ప్రతి విభాగం నుంచి ఆయా విభాగాధిపతి ద్వారా రోజూ వచ్చే రోగుల సంఖ్య, ఆయా విభాగాల్లో విధులు నిర్వహిస్తున్న జూనియర్‌ డాక్టర్లు, పీజీలు, హౌస్‌ సర్జన్‌ల వివరాలను తీసుకున్నారు. వీరంతా మంగళవారం నుంచి సమ్మెకు వెళ్తే అవసరమైన అదనపు వైద్యులను ఎలా సమకూర్చుకోవాలన్న దానిపై చర్చించారు. సీనియర్‌ స్టాఫ్‌ నర్సుల సేవలను ఉపయోగించుకోవాలని, పీహెచ్‌సీలు, ఏరియా ఆస్పత్రుల్లో అదనంగా ఉన్న వైద్యులను రిమ్స్‌కు పంపించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. సమస్య తీవ్రమైన పక్షంలో వైద్యులను తాత్కాలిక పద్ధతిన సమకూర్చుకునేందుకు రాష్ట్ర అధికారులతో మాట్లాడతామని చెప్పా రు. జూనియర్‌ డాక్టర్లు సమ్మెలో ఉన్నంతకాలం డాక్టర్లు అదనపు సమయం పని చేయాలని సూచించారు. అలాగే రిమ్స్‌లోని జూనియర్‌ డాక్టర్లతో కూడా ఆయన మాట్లాడారు. ఇది రాష్ట్రవ్యాప్త నిర్ణ యం కావడంతో తాము సమ్మెలో పాల్గొంటున్నట్లు జూనియర్‌ డాక్టర్లు తెలిపారు. సమావేశం అనంత రం కలెక్టర్‌ వెళ్లిపోతున్న సందర్భంలో కాంట్రాక్ట్‌ స్టాప్‌ నర్సులు తమకు ఐదు నెలలుగా జీతాలు లేవని తెలపగా, మంగళవారం తన కార్యాలయాని కి వస్తే మాట్లాడదామని తనకు అత్యవసర సమా వేశం ఉందని చెప్పి వెళ్లిపోయారు. సమావేశంలో సూపరింటెండెంట్‌ డాక్టర్‌ సౌమిని, ఇన్‌చార్జి ఆర్‌ఎంవో డాక్టర్‌ సీపీ శ్రీదేవి, విభాగాధిపతులు ప్రసన్న కుమార్‌, పార్వతి, సునీల్‌ నాయక్‌, జేడీ రాజశేఖర్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement