మల్కన్‌గిరి: ఒడిశా ప్రధాన ఎన్నికల అధికారి ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్న ప్రత్యేక సంక్షిప్త ఓటరు జాబితా సవరణ కార్యక్రమంలో భాగంగా ఆదివారం మల్కన్‌గిరి జిల్లా చిత్రకొండ సమితిలో జిల్లా కలెక్టర్ ప్రధమేశ్ అర్వింద్ రాజాశిర్క సందర్శించి క్షేత్రస్థాయి పనులపై సమీక్ష నిర్వహించారు. చిత్రకొండ సమితిలో బూత్ స్థాయి అధికారుల ఆధ్వర్యంలో కొనసాగుతున్న ఆన్‌లైన్ పత్రాల ఆప్‌లోడ్ ప్రక్రియ పురోగతిపై సమీక్షించారు. ఓటర్ల క్లెయిమ్‌లు, అభ్యంతరాలపై విచారణ ప్రక్రియను పూర్తి చేసిన నేపథ్యంలో.. దీనికి సంబంధించిన వివరాలపై స్పష్టత అవసరమని సహాయ ఓటరు నమోదు అధికారులకు సూచించారు. ఓటు హక్కును ప్రతీ ఒక్కరు వినియోగించాలి, పూర్తి స్థాయిలో ఈ పనులు వేగవంతం చేయాలన్నారు. చిత్రకొండ తహసీల్దార్, జిల్లా విద్యాశాఖ అధికారి, ఇతర అధికారులు పాల్గొన్నారు.


