14 కిలోల గంజాయి పట్టివేత | - | Sakshi
Sakshi News home page

14 కిలోల గంజాయి పట్టివేత

Aug 10 2026 2:10 AM | Updated on Aug 10 2026 2:10 AM

ఒకరి అరెస్టు

మల్కన్‌గిరి: బలిమెల పోలీసు స్టేషన్‌ పరిధిలోని ఎం.వి.37 గ్రామం కూడలి వద్ద ఆదివారం ఉదయం ఆరు గంటల సమయంలో ఎకై ్సజ్‌ పోలీసులు వాహనాలను తనిఖీ చేశారు. ఈ సమయంలో ద్విచక్ర వాహనంపై ఓ వ్యక్తి వేగంగా రావడంతో అనుమానం ఆపి తనిఖీ చేయగా ఓ బస్తాలో గంజాయి ఉన్నట్టు గుర్తించారు. చత్తీస్‌గఢ్‌ రాష్ట్రం సుకుమ జిల్లాకు గంజాయిని తరలిస్తున్నట్లు నిందితుడు అంగీకరించినట్టు పోలీసులు వెల్లడించారు. స్వాధీనం చేసుకున్న గంజాయి విలువ లక్షన్నర రూపాయలు ఉంటుందని ఎకై ్సజ్‌ పోలీసు ఇన్స్‌స్పెక్టర్‌ తెలిపారు. నిందితుడు బిక్రమ్‌ ఖిల్లాపై కేసు నమోదు చేసి సోమవారం కోర్టుకు తరలిస్తామని చెప్పారు.

రైల్వే స్టేషన్‌లో 4 కిలోలు..

రాయగడ: కొరాపుట్‌ నుంచి రౌర్‌కెలా ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్‌లోని జనరల్‌ భోగీలో సుమారు నాలుగు కిలోల గంజాయిని రైల్వే పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. శనివారం రాత్రి ట్రైన్‌ రాయగడకు చేరుకునే సమయంలో పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్న క్రమంలో చివరి భోగీలొ పరిశీలించగా ఒక బ్యాగు అనుమానాస్పదంగా కనిపించింది. దీనిని తెరిచి తనిఖీ చేయగా అందులో గంజాయి పట్టుబడింది. అయితే బ్యాగు ఎవరిదో పోలీసులు విచారించినప్పటికీ ప్రయాణికుల నుంచి సరైన సమాధానం లేకపొవడంతో నిందితుడు పరారైనట్లు గుర్తించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement