సీఎం హామీకి ఏడాది | - | Sakshi
Sakshi News home page

సీఎం హామీకి ఏడాది

Aug 10 2026 2:10 AM | Updated on Aug 10 2026 2:10 AM

● తెరచుకోని పేపర్‌ మిల్లు

కొరాపుట్‌: రాష్ట్ర ముఖ్యమంత్రి మెహన్‌ చరణ్‌ మజ్జి హామీ ఇచ్చి ఏడాదైనా పేపర్‌ మిల్లు తెరచుకోలేదని సీపీఐ కొరాపుట్‌ జిల్లా కార్యదర్శి జుధిష్ట రవులో ఆరోపించారు. ఆదివారం గగనాపూర్‌లోని బిల్ట్‌ సేవా పేపర్‌ మిల్లు ఆవరణలో జరిగిన సభలో ప్రసంగించారు. గత ఏడాది ఇదే రోజున జయపూర్‌ వచ్చిన సీఎం త్వరలో మిల్లు తెరిపిస్తామని తమకు హామీ ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. కానీ నేటికీ ఆ సమస్య పరిష్కారంలో ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంతో వందలాది కార్మికులు ఆకలి కేకలు వేస్తున్నారన్నారు. రిటైర్‌ అయిన కార్మికులకు ఇంతవరకు పరిశ్రమ నుంచి బకాయిలు రాలేదన్నారు. నెలల తరబడి కార్మికులకు జీతాలు లేవన్నారు. ఈ సమస్యపై తాము మరోసారి ఉద్యమిస్తామని జుదిష్ట రవులో హెచ్చరించారు. సమావేశంలో కార్మిక నాయకులు ప్రమోద్‌ మహంతి, సుదర్శన్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement