రాయగడ: ప్రముఖ తెలుగు సినీ నటుడు మహేష్‌బాబు జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని స్థానిక డైహార్డ్ ఫ్యాన్స్, డాక్టర్ అబ్దుల్ కలామ్ ఫౌండేషన్ సంయుక్తంగా ఆదివారం జిల్లా కేంద్రాస్పత్రిలో రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఉదయం పదికి ప్రారంభమైన శిబిరం సాయంత్రం ఐద గంటల వరకు జరిగింది. రక్తనిధి అధికారి డాక్టర్ కె.నవీన్‌కుమార్, డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలామ్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు బొగిలి రాజేష్ కుమార్ కార్యక్రమాన్ని పరివేక్షించారు. వివిధ ప్రాంతాలకు చెందిన యువకులు స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. చిన్న అడుగు ఒక ప్రాణాన్ని కాపాడగలదు అనే నినాదంతో నిర్వహించిన ఈ శిబిరానికి అనూహ్య స్పందన లభించింది. ఈ సందర్భంగా 24 యూనిట్ల రక్తాన్ని సేకరించారు


