వజ్రపుకొత్తూరు రూరల్: ఆదివాసీల హక్కులు, సంస్కృతి, సంప్రదాయాలు, భాషలు, జీవన విధానా న్ని పరిరక్షించడంతో పాటు వారి అభ్యున్నతికి ప్రభుత్వాలు ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నాయని కలెక్టర్ స్వప్నికల్ దినకర్ పుండ్కర్ అన్నారు. పలాస రైల్వే గ్రౌండ్‌లో ఆదివారం ప్రపంచ ఆదివాసీ దినోత్సవా న్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భోగాపురం గ్రీన్‌ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయానికి అల్లూరి సీతారామరా జు పేరు పెట్టడం ద్వారా ఆదివాసీలకు మరింత గౌరవం పెరిగిందన్నారు. జిల్లాలో 16 మండలాల్లో సుమారు 90 వేల మంది సవర గిరిజనులు నివసిస్తున్నారని వీరందరికీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వివిధ సంక్షేమ పఽథకాలు అందిస్తున్నాయని అన్నా రు. ఐటీడీఏ పరిధిలో 268 ప్రభుత్వ పాఠశాలు ఉండగా వాటిలో సుమారు 20 వేల మంది చదువుతున్నారని తెలిపారు. అటవీ ఉత్పత్తులకు ‘అమోఘం’ బ్రాండ్‌తో విస్తృత మార్కెట్ కల్పించి గిరిజనుల ఆదాయాన్ని పెంచే విధంగా చర్యలు చేపట్టామని చెప్పారు. ఆదివాసీ నాయకులు మాట్లాడుతూ శ్రీకాకుళం ఆదివాసీ ప్రాంతాలకు 5వ షెడ్యూల్ అమలు చేయాలని, ఆదివాసీ ప్రాంతంలో ఆక్రమ మైనింగ్, సహజ వనరుల దోపిడీని అరికట్టాలని కోరారు. ఆదివాసీ హక్కుల సాధన పోరాటాలతోనే సాధ్యమని, తమ హక్కుల పరిరక్షణ, వాటి సాధన కోసం ఐకమత్వంగా పోరాటాలు చేయాలని ఆదివాసీ నాయకులు పిలుపునిచ్చారు.


