శ్రీకాకుళం అర్బన్: వినియోగదారుల రక్షణకు పాతచట్టం 1986కు బదులుగా 35/2019గా కేంద్ర ప్రభుత్వం కొత్తచట్టం తీసుకువచ్చిందని మేధావుల ఫోరం అధ్యక్షుడు, విశ్రాంత జిల్లా జడ్జి పప్పల జగన్నాథరావు తెలిపారు. శ్రీకాకుళంలోని పీఎన్ కాలనీలోగల నారాయణ తిరుమల మహా మండపంలో ఆదివారం మేధావుల ఫోరం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ కొత్తచట్టం గురించి వివరించారు. మధ్యవర్తిత్వం సెల్ ద్వారా పరిష్కారం వైపు పనిచేయవచ్చునని, జిల్లాస్థాయి అధికారి పరిధి రూ.20లక్షల నుంచి రూ.50లక్షల ఫిర్యాదులు తీసుకోవడానికి పెంచార ని తెలిపారు. ఫిర్యాది ఉన్న జిల్లా కన్స్యూమర్స్ కమిషన్‌లో లేక స్టేట్, నేషనల్ పరిధిలో నివశించే ప్రదేశంలో ఫిర్యాదు చేయవచ్చన్నారు.


