ఎచ్చెర్ల: అరిణాం అక్కివల స గ్రామంలో జాతీయ రహదారి వద్ద ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందాడు. ఎచ్చెర్ల పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం.. మండలంలోని కేశవరావు పేట గ్రామానికి చెందిన మెట్ట గణపతి (25) లావే రు మండలం బొంతుపేట గ్రామంలో ఓ శుభకా ర్యానికి వెళ్లి ద్విచక్రవాహనంపై తిరిగి వస్తుండగా అరిణాం అక్కివలస వద్ద బైక్ అదుపు తప్పి డివైడర్ ను ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంతో తీవ్ర గాయాలైన గణపతిని అంబులెన్స్‌లో శ్రీకాకుళం రిమ్స్‌కు తరలిస్తుండగా దారిలోనే మృతి చెందాడు. మృతుడు రెండేళ్ల నుంచి పైడి భీమవరం రెడ్డీస్ కంపెనీలో పనిచేస్తున్నాడు. ఈయనకు తల్లి, చెల్లి ఉన్నారు. చెల్లికి వివాహం జరిగింది. తల్లి కూలి పనిచేస్తుంటారు. ఉన్న ఒక్కగానొక్క కుమారుడు రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో ఆ తల్లి కన్నీరుమున్నీరయ్యారు. తల్లి ఫిర్యాదు మేరకు ఎచ్చెర్ల పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


