కవిటి : ‘చిన్నారికి ప్రాణాపాయం.. దాతలపైనే భారం’ అనే శీర్షికన శనివారం ‘సాక్షి’లో ప్రచు రితమైన కథనానికి దాతలు స్పందించారు. ఆదివారం మండలంలోని మడియరిపుట్టుగకు చెందిన హారతి అనే చిన్నారి కుటుంబానికి శ్రీరేయమ్మతల్లి హెల్పింగ్ హ్యాండ్స్ సంస్థ ఆప న్న హస్తం అందించింది. ఈ మేరకు బాధితురాలి కుటుంబానికి రూ.10,000 నగదు అందించారు. చిన్నారి త్వరగా కోలుకుని సంపూర్ణ ఆరోగ్యంతో ఇంటికి చేరుకోవాలని, మిగిలిన వారూ సాయం చేయాలని వారు కోరారు.
ఎచ్చెర్ల: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విశ్వవిద్యాల యం ప్రహరీ కూలిపోయింది. వెంకటేశ్వర కళాశాలకు పక్కన ఆర్టీఓ కార్యాలయానికి వెళ్లే రహదారిని ఆనుకుని ఉన్న గోడ ఆదివారం కూలి పోయింది. వర్సిటీ రక్షణ గోడ మొత్తం ఇలానే తయారైంది. ఎప్పుడు ఎక్కడ కూలిపోతుందో తెలీని పరిస్థితి నెలకొంది.
శ్రీకాకుళం (పీఎన్‌కాలనీ): శిష్టకరణాలను ఓబీ సీ జాబితాలో కలపాలని, దీర్ఘకాలిక సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఈ నెల 23న చలో విశాఖపట్నం నిర్వహించనున్నట్లు శిష్టకరణ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పోలుమహ ంతి ఉమామహేశ్వరరావు అన్నారు. శ్రీకాకుళం నగరంలో శిష్టకరణ సంఘ కార్యాలయంలో ఆదివారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ విశాఖపట్నంలోని సింహాచలంలో సమావేశం నిర్వహించనున్నామని, అనంతరం ఢిల్లీకి వెళ్లనున్నట్లు తెలిపారు. జిల్లాలో అన్ని ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో శిష్టకరణ కులస్తులు హాజరు కావాలని కోరారు. సమావేశంలో జిల్లా శిష్టకరణ సేవా సంఘం జిల్లా అధ్యక్షుడు డబ్బీరు శ్రీనివాసరావు, ప్రధాన కార్యదర్శి సదాశివుని కృష్ణ, కోశాధికారి బలివాడ శివప్రసాద్, బలివాడ మల్లేశ్వరరావు, డాక్టర్ శ్రీనివాసపట్నాయక్ తదితరులు పాల్గొన్నారు.
శ్రీకాకుళం రూరల్: మండల పరిధిలోని రాగో లు జెమ్స్‌లో గల బొల్లినేని మెడిస్కిల్స్‌లో నూ తన నైపుణ్య కోర్సులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఆ సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సీహెచ్ నాగేశ్వరరావు ఆదివారం ఓ ప్రకటనలో తెలిపా రు. పదో తరగతి, ఇంటర్ పూర్తయిన విద్యార్థులకు చైల్డ్‌కేర్ టేకర్, కేర్ గివర్, ఎల్డర్లీ కేర్ టేకర్ కోర్సుల్లో శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. 18 నుంచి 30ఏళ్లలోపు గల యువతీ యువకులు అర్హులన్నారు. శిక్షణ కాలంలో ఉచిత భోజన, వసతి సదుపాయాలు కల్పించనున్నట్లు తెలిపా రు. శిక్షణ అనంతరం సర్టిఫికెట్ జారీ చేస్తూ ఆయా సంస్థల్లోనే ఉద్యోగ అవకాశాలు కల్పించను న్నట్లు తెలిపారు. మరిన్ని వివరాలు కో సం 76809 45357, 9121999654 నంబర్లను సంప్రదించాలని తెలిపారు.
శ్రీకాకుళం న్యూకాలనీ, టెక్కలి రూరల్: హైదరాబాద్ గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో ఆదివారం జరిగిన తైక్వాండో గ్రూప్ ఈవెంట్ గిన్నీస్ వరల్డ్ రికార్డ్ సాధించింది. శ్రీకాకుళం జిల్లా నుంచి మొట్టమొదటి వ్యక్తిగా తైక్వాండో సీనియర్ ప్లేయర్ బి.చిరంజీవి ఈ రికార్డుని సాధించుకున్నారు. కష్టతరమైన మెలకువలు జయంత్ రెడ్డి వద్ద నేర్చుకోవడం వల్లే ఇది సాధ్యమైందని చిరంజీవి తెలిపారు. అలాగే టెక్కలి ఎన్టీఆర్ క్రీడా వికాస్ కేంద్రానికి చెందిన తైక్వాండో క్రీడాకారులు మెండ తపస్వీ, తమిరే జ్ఞానదీప్, అట్టాడ మహీంధర్ కూడా పాల్గొన్నారు.


