‘సాఫ్ట్‌బాల్ క్రీడను ఉన్నత స్థాయికి తీసుకెళ్దాం’
నాట్లు వేస్తుండగా పిడుగుపాటు
ఇద్దరు మహిళల దుర్మరణం
నలుగురికి గాయాలు
ఒక ఇంటికి ఆ తల్లే ఆధారం. భర్తను కోల్పోయినా ఉన్నగానొక్క ఒక్క కుమార్తెను కంటికి రెప్పలా కాపాడుకుంటూ వచ్చారు. కూలీనాలీ చేసుకుంటూ పొట్ట పోసుకుంటున్నారు. ఇప్పుడు పిడుగు పాటు ఆ అమ్మాయికి అమ్మను దూరం చేసింది. రేపటి భవిష్యత్‌ను అంధకారం చేసింది. మరో ఇంటిది ఇంకో విషాద గాథ. కళ్లు లేని భర్తను, దివ్యాంగురాలైన కుమార్తెను ఆ ఇల్లాలే చూసుకుంటున్నారు. కూలి పనులకు వెళ్తూ కాసిన్ని రాళ్లు సంపాదిస్తూ ఇంటిని పోషిస్తున్నారు. పిడుగు పాటు ఆ కుటుంబాన్ని ఇప్పుడు సంకట స్థితిలో పడేసింది. తల్లి దూరం కావడంతో దివ్యాంగురాలైన కుమార్తె, భార్య దూరం కావడంతో చూపులేని
భర్త దిక్కుతోచని స్థితికి వెళ్లిపోయారు.
మందస:
బడుగుల జీవితాలపై పిడుగు పడింది. వరి నాటేందుకు పొలంలోకి దిగితే పిడుగుపాటు బతుకులను చీకటి చేసింది. మందస మండలం పెడంగో గ్రామంలో ఆదివారం పిడుగు పడి ఇద్దరు మహిళలు అక్కడికక్కడే మృతి చెందారు. మరో నలుగురు మహిళలు గాయపడ్డారు. వివరాల్లోకి వెళితే..
బుడార్సింగి సమీపంలోని పొలాల్లో ఉభాలు జరుగుతున్నాయి. ఇదే పంచాయతీ పెండగో గ్రా మానికి చెందిన కట్ట సోముద్రి (45), పాతకోట గ్రామానికి చెందిన సవర జోర(44).. నాట్లు వేసేందుకు పనికి కుదిరారు. వీరితో పాటు మరికొంత మంది కూడా పొలం పనికి వచ్చారు. పనులన్నీ పూర్తయ్యి ఇంకాసేపటి తర్వాత ఇంటికి వెళ్లిపోతామనగా.. నిండుగా మబ్బులు కమ్ముకున్నాయి. ఉన్నట్టుండి పిడుగు పడడంతో కట్ట సోముద్రి, సవర జోర ఆ ధాటికి పొలంలోనే ప్రాణాలు వదిలేశారు. వారితో పాటు పనిచేస్తున్న వారిలో మజ్జి దేవకి, బోయ పోరోమి, కమార్ నీల, కట్ట సుస్మిత గాయపడ్డారు. వీరిని స్థానికులు 108 వాహనంలో హరిపురం ప్రభుత్వాస్పత్రికి పంపించారు.
మృతుల్లో కట్ట సోముద్రికి భర్త భాస్కర్ చనిపోగా పదహారేళ్ల కుమార్తె ఉన్నారు. తల్లి మరణంతో ఆ కుమార్తె ఒంటరైపోయింది. అలాగే సవర జోర భర్త అంధుడు. పాప గాయత్రి దివ్యాంగురాలు. జోర మృతితో ఆ కుటుంబం దిక్కులేనిదయ్యింది. మందస పోలీసులు కేసు నమోదు చేశారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం హరిపురం ఆస్పత్రికి తరలించారు.
శ్రీకాకుళం న్యూకాలనీ: రాష్ట్రంలో సాఫ్ట్‌బాల్ క్రీడను మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లే విధంగా అన్ని జిల్లాల సాఫ్ట్ బాల్ సంఘాల ప్రతినిధులు, కోచ్ లు, వ్యాయామ ఉపాధ్యాయులు సమష్టిగా కృషి చేయాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సాఫ్ట్ బాల్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి సూర శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సాఫ్ట్ బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శ్రీకాకుళం లోని క్రిస్టల్ ప్యాలెస్ ఫంక్షన్ హాల్ వేదిక జరుగుతున్న రెండు రోజుల స్టేట్ లెవెల్ సాఫ్ట్ బాల్ సెమినార్ కం ఎంపైర్స్ క్లినిక్–2026 కార్యక్రమం ఆదివారం రాత్రితో ముగిసింది. ఈ సందర్భంగా నిర్వహించిన ముగింపు కార్యక్రమానికి సూర శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ రాష్ట్రంతో పాటు శ్రీకాకుళం జిల్లాలోని సాఫ్ట్‌బాల్ క్రీడకు గణనీయమైన ఆదర ణ లభిస్తుండటం సంతోషంగా ఉందన్నారు. సాఫ్ట్‌బాల్ అసోసియేషన్ రాష్ట్ర కన్వీనర్ మొజ్జాడ వెంకటరమణ, జగదీశ్వర్ రెడ్డి, కోశాధికారి సామంత్ రెడ్డి పర్యవేక్షణలో సుమారు 120 మంది కోచ్‌లు, ఔత్సాహిక సీనియర్ క్రీడాకారులు, పీడీ–పీఈటీలకు సాఫ్ట్‌బాల్ గేమ్ పై అంపైర్లుగా శిక్షణ తరగతులు నిర్వహించారు. శిక్షణ అనంతరం ముఖేష్ దేశ్ పాండే ఆధ్వర్యంలో శిక్షణకు సంబంధించి పరీక్షలు నిర్వహించారు.


