పూరీ–కొరాపుట్‌ రైల్‌ను జయపూర్‌ వరకు పొడిగించాలి | - | Sakshi
Sakshi News home page

పూరీ–కొరాపుట్‌ రైల్‌ను జయపూర్‌ వరకు పొడిగించాలి

Aug 10 2026 2:10 AM | Updated on Aug 10 2026 2:10 AM

కొరాపుట్‌: పూరీ నుంచి కొరాపుట్‌ వరకు నడుస్తున్న పగటి పూట రైల్‌ని జయపూర్‌ వరకు పొడిగించాలని జయపూర్‌ జాగరణ పరిషత్‌ డిమాండ్‌ చేసింది. అందుకు తగ్గ లేఖని జయపూర్‌ రైల్వే స్టేషన్‌ మేనేజర్‌ రోషన్‌ దాస్‌కి పరిషత్‌ సభ్యులు అందజేశారు. పూరీ–కొరాపుట్‌ రైలు రాత్రి 11.30కి కొరాపుట్‌ చేరుతుందన్నారు. ఆ రాత్రి పూట జయపూర్‌, నబరంగ్‌పూర్‌, మల్కన్‌గిరి ప్రాంతాల ప్రయాణికులు రవాణా వసతి లేక రైల్వే స్టేషన్‌లో గడపాల్సి వస్తుందన్నారు. అంతేకాక ఉదయం ఐదు గంటలకు కొరాపుట్‌లో ఈ రైలు బయలు దేరుతుందన్నారు. ఆ సమయంలో కొరాపుట్‌ చేరడానికి రవాణా సౌకర్యాలు లేవన్నారు. అందుకే ఈ రైలు జయపూర్‌ వరకు పొడిగిస్తే అన్ని ప్రాంతాల ప్రజలకు సేవలు అందుతాయన్నారు. ఈ లేఖని ఈస్ట్‌ కోస్ట్‌ జనరల్‌ మేనేజర్‌కి పంపాలని విజ్ఞప్తి చేశారు. ఈ బృందంలో శ్రీనివాస్‌ బాలారాయ్‌, రాజేంద్ర గౌడ, వై.ప్రసాద్‌, గుప్త చంద్ర గౌడ, జగదీష్‌ పాఽడీ, ప్రమెద్‌ మహంతి, సుదర్శన్‌ బిసోయి ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement