పర్లాకిమిడి: స్థానిక గజపతి స్టేడియం వద్ద ఉన్న ఆరబిందో పూర్ణాంగ శిక్ష కేంద్రంలో ఆదివారం గజపతి జిల్లా మాజీ సైనికుల సంఘ సమావేశం జరిగింది. తొలిత మాజీ సైనిక ఉద్యోగులు అరబిందో, భారత్ మాత చిత్రపటాలకు జ్యోతిని వెలిగించి సమావేశం ప్రారంభించారు.
ఈ సమావేశానికి అధ్యక్షుడు కెప్టెన్ ఎన్.సి.డాష్ అధ్యక్షత వహించారు. అధ్యక్షుడు లెఫ్టినెంట్ వై.మురళీధర్, మాజీ అధ్యక్షుడు కెప్టెన్ మల్లికార్జున పట్నాయక్, ఉపాధ్యక్షుడు సుబేదార్ బి.కృష్ణారావు, కోశాధికారి సార్జెంట్ భవానీ శంకర్ ఆచార్య తదితరులు హాజరయ్యారు. ఈ సమావేఽశంలో మాజీ సైనికుల కోసం కార్యాలయాలు, యుద్ధ స్మారక స్తంభాల కోసం స్థలం మంజూరు చేయాలని, మాజీ సైనిక ఉద్యోగుల కోసం ఈ.సి.ఎస్.హచ్ హెల్త్ క్లినిక్‌లు జిల్లాలో ఏర్పాటుచేయాలని మాజీ సైనికుడు మనోజ్ దాస్ కోరారు. మాజీ సైనికుల కుటుంబాల కోసం కేంద్ర, రాష్ట్ర మాజీ సైనికులు సంక్షేమ సంఘాలు పంపించిన పలు లేఖలను చదివి వినిపించారు.


