పర్లాకిమిడి: మొక్కలతోనే పర్యావరణ పరిక్షణ సాధ్యమని వక్తలు అన్నారు. కాశీనగర్ బ్లాక్ రాణిపేట వద్ద నియాతీ మానసిక దివ్యాంగుల విద్యాలయంలో ప్రగతి మహిళా సంఘటన్, వినోదినీ సైన్స్, ఆర్ట్స్ ప్లస్‌టు కళాశాలలోని రెడ్‌క్రాస్, ఎన్‌ఎస్‌ఎస్ ఆధ్వర్యంలో వన మహోత్సవం శనివారం చేపట్టారు. పర్లాకిమిడి ఆదర్శ పోలీసుస్టేషన్ ఐఐసీ ప్రశాంత భూపతి పాల్గొని మొక్కలను నాటారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ మనోజ్‌కుమార్ పట్నాయక్, కో–ఆర్డినేటర్ రవీంద్ర పాణిగ్రాహి, యువ రెడ్‌క్రాస్ కో–ఆర్డినేటర్ కల్పలా పండా తదితరులు పాల్గొన్నారు.


