వ్యవసాయాధికారులు కఠిన నిర్ణయం | - | Sakshi
Sakshi News home page

వ్యవసాయాధికారులు కఠిన నిర్ణయం

Aug 9 2026 2:22 AM | Updated on Aug 9 2026 2:22 AM

● మహాలక్ష్మి ట్రేడర్స్‌ ఎరువుల విక్రయ లైసెన్స్‌ రద్దు ● 740 బస్తాల అమ్మోనియం సల్ఫేట్‌ స్వాఽధీనం

● మహాలక్ష్మి ట్రేడర్స్‌ ఎరువుల విక్రయ లైసెన్స్‌ రద్దు ● 740 బస్తాల అమ్మోనియం సల్ఫేట్‌ స్వాఽధీనం

రాయగడ: వ్యవసాయశాఖాధికారులు కఠిన నిర్ణయం తీసుకున్నారు. రాయగడ పట్టణంలోని మహాలక్ష్మి ట్రేడర్స్‌లో అక్రమంగా అమ్మోనియం సల్ఫేట్‌ ఎరువులను నిల్వ చేసి విక్రయిస్తున్నారనే ఆరోపణలపై చర్యలు చేపట్టారు. సంస్థ ఎరువుల విక్రయ లైసెన్స్‌ను నెల రోజూలు రద్దు చేయడంతో పాటు పాయింట్‌ ఆప్‌ సేల్‌ (పీవోఎస్‌) యంత్రాన్ని కూడా అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఆలస్యంగా వెలుగు చూసిన ఈ ఘటనకు సంబంధించి అందిన సమాచారం మేరకు.. జూలై 31వ తేదీన వ్యవశాయ శాఖ అధికారులు మహాలక్ష్మి ట్రేడర్స్‌కు సంబంధించి పలు గోదాములపై ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. రాయగడ సమీపంలోని అన్నపూర్ణ రైస్‌ మిల్లులోఉన్న స్టాక్‌ పాయింట్‌ నుంచి 740 బస్తాల అమ్మోయం సల్ఫేట్‌ ఎరువులను అధికారులు గుర్తించారు. ఎటువంటి అనుమతి పత్రాలు లేకపొవడంతో విక్రయానికి సంబంధించి అక్రమాలు ఉన్నట్లు గుర్తించిన అధికారులు ఈ మేరకు చర్యలు తీసుకున్నారు. తనిఖీల్లొ భాగంగా ఛత్తీస్‌గఢ్‌లొని భిలాయ్‌కు చెందిన సంబంధిత తయారీ సంస్థను అధికారులు సంప్రదించగా మహాలక్ష్మి ట్రేడర్స్‌కు తాము ఈ రకమైన ఎరువులను విక్రయించలేదని తేలింది. దీంతో వ్యవహారాన్ని వ్యవసాయ శాఖ అధికారులు మరింత తీవ్రంగా పరిగణలోకి తీసుకున్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా శుక్రవారం సమితి వ్యవసాయ శాఖ అధికారి శ్యామ్‌ ముర్ము నేతృత్వంలోని అధికారులు మహాలక్ష్మి ట్రేడర్స్‌కు చేరుకుని యజమాని కె.రమేష్‌ పేరిట ఉన్న లైసెన్స్‌ రద్దు చేస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేశారు. సస్పెన్షన్‌ (రద్దు) కాలంలో సంస్థ ఎలాంటి ఎరువులను కొనుగోలు చేయడం, విక్రయించడం చేయరాదని స్పష్టం చేశారు. స్వాధీనం చేసుకున్న పీవోఎస్‌ యంత్రాన్ని వ్యవసాయ శాఖ ఆధీనంలో ఉంచారు. జిల్లాలో ఎరువుల అక్రమ నిల్వలు, నల్లబజారును ఏమాత్రం సహించబోమని జిల్లా కలెక్టర్‌ అశుతోష్‌ కులకర్ణి స్పష్టం చేశారు. అక్రమ రవాణా, నల్లబజారును అరికట్టేందుకు ప్రత్యేక ఎన్‌ఫొర్స్‌మెంట్‌ బృందాలను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ఈ క్రమంలో ఇప్పటికే రెండు ఎరువులతో ఉన్న వాహనాలను స్వాధీనం చేసుకుని పోలీస్‌ స్టేషన్‌లో ఉంచినట్లు చెప్పారు. ఇదిలాఉండగా జిల్లాలోని బిసంకటక్‌ సమితిలోని ఓ ఎరువుల గొదాముపైనా అధికారులు దాడి చేశారు. సంబంధిత సంస్థకు ఎరువులు విక్రయించేందుకు అనుమతి లైసెన్స్‌ లేకపోయినప్పటికీ అక్కడా ఎరువుల బస్తాలు ఉన్నట్టు గుర్తించారు. అవి మార్క్‌ఫెడ్‌ నుంచి సరఫరా అయినట్లు ప్రాథమికంగా గుర్తించారు. ఈ వ్యవహారంపై విచారణ కొనసాగుతుంది. మహాలక్ష్మి ట్రేడర్స్‌ వద్ద లభించిన ఎరువులు ఎక్కడ నుంచి వచ్చాయి, గొదాముకు ఎలా చేరాయి, రైతులకు విక్రయించారా, మార్క్‌ఫెడ్‌ నుంచి లైసెన్స్‌ లేని సంస్థ వద్దకు ఎరువులు ఎలా చేరాయి, సరఫరా వ్యవస్థలో మరెవరైనా భాగస్వాములుగా ఉన్నారా అనే అంఽశంపై అధికారులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఎరువుల అక్రమ నిల్వలు, అధిక ధరలకు విక్రయించడం వంటి చర్యల వల్ల నేరుగా రైతులపై ప్రభావం పడుతుందని రైతు వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఈ వ్యవహారంపై సమగ్ర దర్యాప్తు చేపట్టి అక్రమాలకు, అధిక ధరలకు విక్రయించే వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకోవాలని రైతులు కొరుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement