చేనేత వస్త్రాలను ఆదరించండి | - | Sakshi
Sakshi News home page

చేనేత వస్త్రాలను ఆదరించండి

Aug 9 2026 2:22 AM | Updated on Aug 9 2026 2:22 AM

ఆకట్టుకున్న ఫ్యాషన్‌ షో

భువనేశ్వర్‌: జాతీయ చేనేత దినోత్సవం(12వ)లో భాగంగా ఒడిశా చేనేత వస్త్రధారతణతో నిర్వహించిన ఫ్యాషన్‌ షో ప్రేక్షకులను ఔరా అనిపించింది. చేనేత సంప్రదాయం, నేత కార్మికుల విశిష్ట నైపుణ్యత ఆధునిక దృక్పథాన్ని ఈ కార్యక్రమంలో ప్రదర్శించడం విశేషం. రాష్ట్ర చేనేత, వస్త్ర మరియు హస్తకళల శాఖ ఆధ్వర్యంలో ఈ ప్రదర్శన నిర్వహించారు. రాష్ట్రంలోని సాంప్రదాయ నేత కార్మికులను ఆధునిక ఫ్యాషన్‌ పోకడలతో అనుసంధానపరచి చేనేత కార్యకలాపాలు ప్రోత్సహించడం ఈ కార్యక్రమం లక్ష్యంగా పేర్కొన్నారు. ఈ ప్రత్యేక ర్యాంప్‌ షోను, భువనేశ్వర్‌ నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫ్యాషన్‌ టెక్నాలజీ’ (నిఫ్ట్‌), ఆదిత్య బిర్లా గ్రూప్‌కు చెందిన లివా వర్గాలు 4 సీక్వెన్సులలో వస్త్రధారణ ఒంపుసొంపుల్ని ప్రదర్శించారు. నిఫ్ట్‌ భువనేశ్వర్‌ ప్రదర్శించిన మొదటి రెండు సీక్వెన్సులలో జీఐ ట్యాగ్‌ సాధించిన చేనేత వస్త్రాలతో తయారు చేసిన రెడీమేడ్‌ వస్త్రధారణ ఆకర్షణని ప్రదర్శించారు. దీని తర్వాత ఆదిత్య బిర్లా గ్రూప్‌ వారి ‘లివా’ బృందం సభ్యులు సంప్రదాయ చేనేత, సమకాలీన ఫ్యాషన్‌ యొక్క విశిష్టమైన సమ్మేళనాన్ని ప్రదర్శించారు. ఈ రాష్ట్ర స్థాయి కార్యక్రమం మగ్గం సమాజాన్ని గౌరవించి ప్రాంతీయ హస్తకళా సమూహాల ప్రోత్సాహంతో ఒడిశా చేనేత వస్త్రాలను ప్రపంచ ఫ్యాషన్‌ రంగంలో ఉనికిని బలపరిచే దిశలో ప్రభుత్వం నిరంతర నిబద్ధతను ప్రతిబింబించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement