సరుకు రవాణా 81.40 మిలియన్‌ టన్నులు | - | Sakshi
Sakshi News home page

సరుకు రవాణా 81.40 మిలియన్‌ టన్నులు

Aug 9 2026 2:22 AM | Updated on Aug 9 2026 2:22 AM

● కొత్త ఆర్థిక సంవత్సరంలో తూర్పు కోస్తా రైల్వే ఘనత

● కొత్త ఆర్థిక సంవత్సరంలో తూర్పు కోస్తా రైల్వే ఘనత

భువనేశ్వర్‌: కొనసాగుతున్న 2026–27 ఆర్థిక సంవత్సరంలోని మొదటి 4 నెలల్లో తూర్పు కోస్తా రైల్వే గణనీయంగా సరుకు రవాణా చేసింది. ఈ ఏడాది ఏప్రిల్‌ నుంచి జూలై వరకు తూర్పు కోస్తా రైల్వే సమగ్రంగా 81.40 మిలియన్‌ టన్నుల సరుకు లోడింగ్‌ను నమోదు చేసింది. ఈ ఏడాది ఏప్రిల్‌ నుంచి జూలై మధ్య జోన్‌ వ్యాప్తంగా వివిధ మండలాల వారీగా సరుకు రవాణాలో ఖుర్దా రోడ్‌ మండలం అగ్ర స్థానంలో నిలిచింది. కొత్తగా ఏర్పాటైన రాయగడ మండలం ధీటైన పని తీరుని ప్రదర్శించింది. ఖుర్దారోడ్‌ మండలం 59.02 మిలియన్‌ టన్నులు, రాయగడ మండలం 13.71 మిలియన్‌ టన్నులు, సంబల్‌పూర్‌ మండలం 8.67 మిలియన్‌ టన్నుల సరుకు రవాణాను నిర్వహించాయి.

రాయగడ మండలం సాఫల్యం కీలకం..

కొత్తగా ఏర్పాటైన రాయగడ రైల్వే మండలం తూర్పు కోస్తా రైల్వే సరుకు రవాణా రంగంలో గణనీయమైన పాత్ర పోషించింది. ఈ ఏడాది ఏప్రిల్‌ నుంచి జూలై వరకు ఈ మండలం 13.71 మిలియన్‌ టన్నుల సరుకును లోడ్‌ చేసింది. పునర్వ్యవస్థీకరించిన రైల్వే నెట్‌వర్క్‌లో సరుకు రవాణా పరంగా రాయగడ మండలం ప్రాముఖ్యతను చాటుకుంది. కేవలం జూలై నెలలో రాయగడ మండలం 3.14 మిలియన్‌ టన్నుల సరుకును రవాణా చేసింది. ఈ మండలం ప్రధానంగా సరుకులలో ఇనుప ఖనిజం రవాణా చేసింది. జూలై నెలలో అత్యధికంగా 2.28 మిలియన్‌ టన్నుల లోడింగ్‌ చేయగా 0.19 మిలియన్‌ టన్నుల బాకై ్సట్‌ లోడింగ్‌ నమోదు కావడం విశేషం. జోన్‌ వ్యాప్తంగా అధికారులు, సిబ్బంది అంకితభావంతో తూర్పు కోస్తా రైల్వే గణనీయంగా సరుకు రవాణా చేయడం సాధ్యమైందని జనరల్‌ మేనేజర్‌ అభినందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement