వదినపై మరిది దాడి | - | Sakshi
Sakshi News home page

వదినపై మరిది దాడి

Aug 8 2026 12:59 AM | Updated on Aug 8 2026 12:59 AM

రాయగడ: వ్యవసాయ భూమి వివాదం ఒక కుటుంబంలో తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. అన్నదమ్ముల మధ్య నెలకొన్న భూతగాదా చివరకు వదినపై దాడికి దారితీయడంతో ఆమె తీవ్రగాయాలపాలయ్యింది. ఈ ఘటన జిల్లాలోని కల్యాణ సింగుపూర్‌ సమితి ధమునిపంగ పంచాయతీ కొత్తగుడ గ్రామంలో శుక్రవారం చోటుచేసుకుంది. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. పూర్ణ పలక అనే మహిళ తన వ్యవసాయ భూమిలో పనులు నిర్వహిస్తుండగా ఆమె మరిది పతి పాలక కుటుంబీకులు పొలం వద్దకు చేరుకుని పూర్ణ పాలకపై వాగ్వాదానికి దిగారు. భూమి తనదేనంటూ పతి పాలక పట్టుబట్టడంతో ఇరువురి మధ్య వాదన చోటుచేసుకుంది. దీంతో కోపొద్రేక్తుడైన పతి పాలక తన వదిన పూర్ణ పాలకపై దాడి చేశాడు. అనంతరం ఆమెను పొలంలోకి నెట్టివేశాడు. సమాచారం తెలుసుకున్న బాధిత కుటుంబీకులు వెంటనే పొలం వద్దకు చేరుకుని, గాయాలతో పడివున్న పూర్ణ పాలకను హాస్పిటల్‌కు తరలించారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement