చోరీకి వెళ్తే ప్రాణం పోయింది | - | Sakshi
Sakshi News home page

చోరీకి వెళ్తే ప్రాణం పోయింది

Aug 7 2026 12:56 AM | Updated on Aug 7 2026 12:56 AM

జయపురం: దొంగతనం చేసేందుకు వెళ్లి గ్రామస్తులు పట్టుకునేందుకు వెంబడించగా దొంగ చెక్‌ డ్యామ్‌లో పడి తీవ్రంగా గాయపడ్డాడు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయాడు. ఈ ఉదంతం జయపురం సమితి తెలియ గ్రామంలో జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి. బుధవారం అర్ధరాత్రి ఒంటిగంట సమయంలో ఒక వ్యక్తి తెలియ గ్రామంలో పద్మణ సోమరత్‌ ఇంటిలో ప్రవేశించి బంగారు ఆభరణాలతో పాటు రూ.10 వేల నగదు దొంగిలించాడు. అయితే ఆ సమయంలో పద్మణ అతడి కుటుంబ సభ్యులు మేల్కొన్నారు. వారిని చూసిన దొంగ భయంతో పరుగు తీసి పారిపోవటానికి ప్రయత్నించాడు. ఆ సమయంలో అతడు సమీపంలో చెక్‌ డ్యామ్‌లో పడిపోయి తీవ్రంగా గాయపడ్డాడు. గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించగా వెంటనే పోలీసులు సంఘటనా ప్రాంతానికి చేరుకున్నారు. చెక్‌ డ్యామ్‌లో పడి ఉన్న దొంగను బయటకు తీసి ఆస్పత్రిలో చేర్చారు. చికిత్స పొందుతున్న సమయంలో అతడు మరణించినట్లు డా క్టర్లు ప్రకటించారు. గుర్తు తె లియని ఆ వ్యక్తి బంధువులు వస్తే వారికి మృతదేహం అప్పగిస్తామని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement