కొరాపుట్: చేయని నేరానికి 22 ఏళ్లు జైలు జీవితం గడిపిన యువకుడు సుప్రీం కోర్టు జోక్యంతో విడుదలయ్యాడు. నబరంగ్‌పూర్ జిల్లా కేంద్రంలోని నువా హిర్లి ప్రాంతంలో అర్జున్ జానీ విషాద గాధ ఇది. 2004 లో పాత డైలీ మార్కెట్ లో సుధా టీ స్టాల్ పని చేస్తున్న బాలుడు టున్ టున్ (అర్జున్ జానీ) గా సుపరిచితుడు. అప్పట్లో మైనారిటీ తీరిన కొద్ది రోజుల్లో అతను నివసిస్తున్న ప్రాంతంలో ముగ్గులు మహిళలు హత్యకి గురయ్యారు. ఈ హత్యలు టున్‌టున్ చేసాడని పోలీసులు ఆరోపణ. ఒక వ్యక్తి హత్యలు జరిగిన ప్రాంతంలో టున్‌టున్‌ని చూశాడనే సాక్ష్యంతో పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల దెబ్బలకు టున్‌టున్ నేరం ఒప్పుకోవాల్సి వచ్చింది. దీంతో టున్‌టున్ కి కోర్టు జీవిత శిక్ష విధించింది. టున్‌టున్‌కి నా అనేవాళ్లు లేకపోవడంతో న్యాయ పోరాటం చేయలేక పోయాడు. దీంతో కొరాపుట్ జిల్లా జైలులో 22 ఏళ్లు జైలు శిక్ష అనుభవించాడు. ఈ కేసు ఇటీవల సుప్రీం కోర్టు దృష్టికి రావడంతో టున్‌టున్‌ను నిర్దోషిగా ప్రకటించింది. దీంతో అతడు విడుదలై నబరంగ్‌పూర్ తిరిగి వచ్చాడు. ఈ విషయం సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం పొందింది. నబరంగ్‌పూర్ ఎమ్మెల్యే గౌరీ శంకర్ మజ్జి టున్‌టున్ వద్దకు వెళ్లి అతని నూతన జీవితం ముందుకు సాగడానికి అన్ని విధాలుగా సహకరిస్తానని హామీ ఇచ్చారు.


