శ్రీకాకుళం క్రైమ్: జిల్లాకేంద్రంలోని అంబేడ్కర్ జంక్షన్ సమీప ఆర్ట్స్ కళాశాల మార్గంలో బుధవారం అర్ధరా త్రి చోటుచేసుకున్న రోడ్డు ప్రమాదంలో ఒక వృద్ధుడు మృతి చెందాడు. ట్రాఫిక్ సీఐ వి.రామారావు తెలిపిన వివరాల మేరకు.. పొందూరు మండ లం వీఆర్ గూడేంకు చెందిన యారా డ గిరిధర్‌రావు (55)కు వివాహం జరగకపోవడంతో అతని సోదరుడే బాగోగులు చూసుకుంటున్నాడు. అయితే అతనికి మతిస్థిమితం సరిగా లేకపోతుండడంతో అప్పుడప్పుడూ ఇంట్లో చెప్పకుండా బయట కు వెళ్లిపోతుంటాడు. ఈక్రమంలో ఈనెల 4వ తేదీ న ఇంటి నుంచి బయటకు వచ్చేశా రు. అనంతరం బుధవారం రాత్రి ఆర్ట్స్ కళాశాల మార్గంలో రోడ్డు మధ్యలో పడుకునిపోయాడు. సరి గ్గా 11.30 గంటల ప్రాంతంలో ఒక ఫార్మా కంపెనీకి చెందిన బస్సు ఉద్యోగులను దించే క్రమంలో అటువైపుగా వచ్చి డ్రైవర్ గమనించకపోవడంతో గిరిధర్‌రావు పైనుంచి వెళ్లిపోవడంతో ఘటనా స్థలంలోనే మృతి చెందాడు. మృతుడిని కుటుంబీకులు గుర్తించడంతో పోస్టుమార్టం నిమిత్తం రిమ్స్‌కు తరలించామని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సీఐ వెల్లడించారు.


