మల్కన్‌గిరి: మల్కన్‌గిరి జిల్లాలో సమాచార, ప్రజసంబంధాల శాఖ ఐపీఆర్ దక్షణాంచాల ఉపనిర్ధశీకుడు బసంత్ ప్రధన్ గురువారం జిల్లాలో పర్యటించి డిఐపీఆర్ కార్యాలయాన్ని పరిశీలించారు. ఆ శాఖ పనుల పురోగతిపై సమీక్షించారు. ఆయనకు జిల్లా సమాచార, ప్రజాసంబంధాల అధికారి ప్రమిళా మాఝి స్వాగతం పలికారు. సమావేశంలో బసంత్ ప్రధన మాట్లాడుతూ.. ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాల సమాచారాన్ని ప్రజలకు విస్తృతంగా చేరే విషయమై ప్రత్యక దృష్టి పెట్టాలని సూచించారు . ప్రజాలకు ప్రభుత్వ పథకలపై సరైన సమాచారం అందించడం, ప్రభుత్వ, ప్రజలకుమధ్య వారధిగా వ్యవహరించడం, సమాచార ప్రజసంబంధల శాఖ బాధ్యత అని అన్నారు. నయగాడ్ మాజీ డీఐపీఆర్ ఓ జ్యోత్సా ్నమయి ఆచార్య , కార్యలాయ సిబ్బంది సత్యానారాయణ్ ప్రధాన్, హరేకృష్ణ కీర్తనీయా, రంజాన్ మాసంతి ఉన్నారు.


