వికసిత్‌ భారత్‌ సంకల్ప్‌ రాష్ట్ర శాఖ అధ్యక్షుడిగా తిరుపతి పాణిగ్రాహి | - | Sakshi
Sakshi News home page

వికసిత్‌ భారత్‌ సంకల్ప్‌ రాష్ట్ర శాఖ అధ్యక్షుడిగా తిరుపతి పాణిగ్రాహి

Aug 7 2026 12:56 AM | Updated on Aug 7 2026 12:56 AM

భువనేశ్వర్‌: వికసిత్‌ భారత్‌ సంకల్ప్‌ రాష్ట్ర శాఖ అధ్యక్షుడుగా హై టెక్‌ గ్రూప్‌ వ్యవస్థాపక అధ్యక్షుడైన డాక్టర్‌ తిరుపతి పాణిగ్రాహి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆ సంస్థ కార్మికుల సంక్షేమం, ఆరోగ్య సంరక్షణ కోసం విశేషంగా కృషి చేస్తుంది. రాష్ట్ర శాఖ ఏర్పాటు నేపథ్యంలో గురువారం భారతీయ జనతా మజ్దూర్‌ మంచ్‌ ఆధ్వర్యంలో హై టెక్‌ మెడికల్‌ కాలేజ్‌ ఆడిటోరియంలో సన్నాహక సమావేశం జరిగింది. ఈ సందర్భంగా హై టెక్‌ గ్రూప్‌ వ్యవస్థాపక అధ్యక్షుడైన డాక్టర్‌ తిరుపతి పాణిగ్రాహి ఒడిశా శాఖ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికై నట్లు ప్రకటించారు. హై టెక్‌ మెడికల్‌ కాలేజ్‌ అండ్‌ హాస్పిటల్‌ చాలా సంవత్సరాలుగా పేదలకు, నిస్సహాయులకు, కార్మికులకు, రోగులకు సేవ చేస్తుండగా వికసిత్‌ భారత్‌ సంకల్ప్‌ సంస్థకు అన్ని రకాల సహకారం అందిస్తుందని తిరుపతి పాణిగ్రాహి హామీ ఇచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement