బాబా ఆలయంలో చోరీ | - | Sakshi
Sakshi News home page

బాబా ఆలయంలో చోరీ

Aug 7 2026 12:56 AM | Updated on Aug 7 2026 12:56 AM

బాబా ఆలయంలో చోరీ పట్టుబడిన దొంగ పాఠశాలలకు ప్రత్యేక సదుపాయాలు 15లోగా ఈకేవైసీ చేయించుకోవాలి

టెక్కలి రూరల్‌: కోటబొమ్మాళి మండలం హరిశ్చంద్రపురం పంచాయతీ పరిధి వింజాంపాడు గ్రామంలోని షిర్డీ సాయిబాబా ఆలయంలో బుధవారం రాత్రి చోరీ జరిగినట్లు అలయ అర్చకులు బంకుపల్లి శాస్త్రి గుర్తించారు. ఈ మేరకు స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. వింజాంపాడు గ్రామంలోని షిర్డీ సాయిబాబా ఆలయానికి గురువారం ఉదయం ఆలయ అర్చకుడు వెళ్లేసరికి అలయం ముందు ఉన్న రెండు హుండీలు తెరిచి ఉండడం గుర్తించారు. అనంతరం అలయం లోపలికి వెళ్లి చూసేసరికి బాబా విగ్రహం పైనున్న కిరీటం సైతం చోరీకి గురైనట్లు తెలిసింది. దీంతో వెంటనే కోటబొ మ్మాళి పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న రూరల్‌ సీఐ శ్రీనివాసరావు, ఇన్‌చార్జి ఎస్‌ఐ సింహాచలం ఘటన స్థలానికి చేరుకుని సీసీ కెమెరాలను పరిశీలించా రు. గుర్తు తెలియని వ్యక్తి దుప్పటి కప్పుకుని వచ్చి చోరీకి పాల్పడినట్లు గుర్తించారు. సుమా రు రూ.40 వేలు విలువ కలిగిన వెండి కిరీటంతో పాటుగా కొంత మొత్తంలో నగదు చోరీకి పాల్పడినట్లు గుర్తించారు. అయితే ఇదే గ్రా మంలో వరుసగా చోరీలు జరుగుతున్నాయని గ్రామస్తులు వాపోతున్నారు.

నరసన్నపేట: స్థానిక శ్రీరాంనగర్‌లో ఒక ఇంట్లో దొంగతనానికి వెళ్లిన బమ్మిడి దేవ కుమార్‌ గాయప డి స్థానికులకు చిక్కాడు. వివరా ల్లోకి వెళ్తే.. గురువారం వేకువజామున శ్రీరాంనగర్‌లోని ఒక ఇంట్లో దొంగతనం చేసేందుకు దేవకుమార్‌ ప్రయత్నించాడు. ఇంతలో ఇంట్లో అలికిడి రావడంతో భయపడి పై అంతస్తు నుంచి కిందికి దూకాడు. పరిగెత్తి వెళ్లిపోయేందుకు ప్రయత్నించాడు. కానీ కాలికి గాయమవ్వడంతో కదలలేకపోయాడు. స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. స్థానిక ఏరి యా ఆస్పత్రిలో అతడికి చికిత్స చేయించారు. కాలికి గాయమైందని కట్టు వేయాలని వైద్యు లు సూచించారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని నరసన్నపేట ఎస్‌ఐ బి. గణేష్‌ తెలిపారు.

ఇచ్ఛాపురం: రాష్ట్రవ్యాప్తంగా 1000 మంది విద్యార్థుల కంటే ఎక్కువగా విద్యార్థులున్న పాఠశాలలకు ప్రత్యేక సదుపాయాలు కల్పించనున్నట్లు జిల్లా విద్యాశాఖాధికారి ఎ.రవిబాబు తెలిపారు. స్థానిక పీఎంశ్రీ ప్రభుత్వ ఉన్నత పాఠశాలను గురువారం ఆయన సందర్శించా రు. ఈ సందర్భంగా పాఠశాలలో పదో తరగతి విద్యార్థులతో మాట్లాడారు. పదో తరగతి పరీక్ష ఫలితాల్లో గతంకంటే అధికంగా ఉత్తీర్ణత సాదించాలని సూచించారు. మిషన్‌ మార్చ్‌ కార్యక్రమంలో ప్రతీ విద్యార్థి తప్పక హాజరై పరీక్షలు రాయాలని సూచించారు. అనంతరం పాఠశాలలోని లైబ్రరీలు, ల్యాబ్‌, కిచెన్‌ షెడ్‌ల ను పరిశీలించారు. మధ్యాహ్న భోజనాన్ని నిబంధనలకు అనుగుణంగా అందించాలని స్పష్టం చేశారు. కార్యక్రమంలో ఉపవిద్యాశాఖా ధికారి విలియమ్స్‌, మండల విద్యాశాఖాధికారి కె.సూర్యారావు, పాఠశాల సిబ్బంది తదితరు లు పాల్గొన్నారు.

శ్రీకాకుళం పాతబస్టాండ్‌: జిల్లాలోని వివిధ గ్యాస్‌ కంపెనీలకు సంబంధించిన వినియోగారులు తప్ప నిసరిగా ఈకేవైసీ చేయించుకోవాలని భారత ప్రభు త్వ పెట్రోలియం, సహజ వాయువుల మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు విడుదల చేసింది. ఈకేవైసీ ఈనెల 15 తేదీలోగా పూర్తి చేయాలని సంబంధిత గ్యాస్‌ సంస్థలకు ఆదేశించింది. సకాలంలో ఈకేవైసీ ధ్రువీకరణ పూర్తిచేయకపోతే ఎల్‌పీజీ సర్వీసులు తాత్కాలికంగా నిలిపివేయచ్చునని పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement