● ఇరువర్గాల మధ్య గొడవ ● ఒకరికి గాయాలు
సంతబొమ్మాళి: చిరిగిన రూ.500ల నోటు విషయంలో గొడవ జరగడంతో ఒకరు గాయపడిన ఘటన మండలంలోని మలగాం గ్రామంలో చో టు చేసుకుంది. స్థానికు లు, బాధితులు తెలిపిన వివరాల మేరకు.. గ్రామానికి చెందిన పది మంది డ్వాక్రా సభ్యుల లోన్ డబ్బులు ప్రతినెలా ఒక సభ్యురాలు కట్టాల్సి ఉంటుంది. జూలై నెలకు సంబంధించి సభ్యురాలు మామిడి పున్నమ్మ వంతు వచ్చింది. దీంతో లోన్ డబ్బులు రూ.20 వేలు తీసుకొని బ్యాంకుకు వెళ్లింది. అయితే అందులో ఒక రూ.500ల నోటు చిరిగిపోవడంతో అధికారులు తిరస్కరించారు. దీంతో తన వద్దనున్న మరొక రూ.500ల నోటును ఇచ్చి లోన్ డబ్బులు కట్టడం జరిగింది. సభ్యుల్లో చిరిగిన రూ.500ల నోటు ఎవరిచ్చారు అనేది చూసుకోలే దు. బ్యాంకుకు వెళ్లిన తర్వాత తెలియడంతో వేరేచో ట చిరిగిన రూ.500ల నోటు ఇస్తే రూ.100లు కమీషన్ తీసుకొని రూ.400లు ఇచ్చారని మిగతా సభ్యులకు పున్నమ్మ చెప్పింది. దీంతో వచ్చేనెల అదనంగా రూ.10 లు చొప్పున ఇస్తామని కొంతమంది సభ్యులు అంగీకరించారు. అయితే కావాలనే చిరిగి న రూ.500 నోటు ఇచ్చి అందరి మీద వసూలు చేయడం ఏమిటని ఒక సభ్యురాలు నౌపడ ఆదిలక్ష్మి ప్రతిరోజూ పున్నమ్మతో వాగ్వావాదం చేసేది. ఈ క్రమంలో బూతులు తిట్టుకోవడంతో ఇరువురి మధ్య తగాదా జరిగింది. ఈ తగాదాలో పున్నమ్మ, అమె భర్త అప్పయ్యపై కర్రలతో నౌపడ రాంబాబు, జోగారావు, చిన్నయ్య, అదిలక్ష్మి, రాజు, లక్ష్మిలు దా డి చేశారు. ఈ దాడిలో అప్పయ్య చేయి విరిగిపోయి తీవ్ర రక్తస్రావం అయింది. దీంతో టెక్కలి జిల్లా అస్పత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. దీనిపై సంతబొమ్మాళి పోలీసులు ఇరువర్గాలపై కేసు నమోదు చేశారు.


