కొరాపుట్: నబరంగ్‌పూర్ జిల్లా నందాహండి సమితి కేంద్రంలో కలెక్టర్ మహేశ్వర్ స్వయ్ బుధవారం ఆకస్మికంగా పర్యటించారు. ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి.. అక్కడ రోగులకు అందుతున్న సేవలు అడిగి తెలుసుకున్నారు. ఆస్పత్రి సిబ్బంది కొందరు గైర్హాజరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం నిశ్నాహండిలో ప్రభుత్వ పాఠశాల సందర్శించారు. అక్కడ విద్యార్థుల కోసం వండుతున్న వంటలు పరిశీలించారు. వాటి నాణ్యత, రుచి చూసి సంతృప్తి వ్యక్తం చేశారు. విద్యార్థులతో మాట్లాడి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఆయనతో పాటు జిల్లా ఉన్నతాధికారులు ఉన్నారు.


