జయపురం: జయపురం సబ్‌డివిజన్ బొయిపరిగుడ సమితి అటవీ సిబ్బంది దొంగతనంగా తరలిస్తున్న విలువైన కలప చెక్కలను పట్టుకున్నారు. మంగళవారం రాత్రి బొయిపిరిగుడ సమితి మఠపొడ అటవీ సెక్టార్ ప్రాంతంలో ఆ ప్రాంత రేంజర్ అనిల్ దాస్ నేతృత్వంలో అటవీ సిబ్బంది పెట్రోలింగ్ జరుపుతున్న సమయంలో ఒక బైక్ పై ఒక వ్యక్తి విలువైన గుగ్గులం కలప చెక్కలు తీసుకు వెళ్తుండగా వారి కంట పడ్డాడు. అటవీ సిబ్బందిని చూచి బైక్ విడచి పరారయ్యాడు. అటవీ అధికారుల వివరణ ప్రకారం అటవీ సిబ్బంది బొయిపరిగుడ సమితి దొరాగుడ జంక్షన్‌లో పెట్రోలింగ్ జరుపుతున్న సమయంలో వస్తున్న బైక్ చూచిన సిబ్బంది, దాన్ని ఆపేందుకు ప్రయత్నించగా అటవీ సిబ్బందిని చూసిన బైకిస్ట్ బైక్‌తో పాటు కలప చెక్కలను విడిచి పరారయ్యాడు. రేంజర్ అనిల్ దాస్ బైక్ వద్దకు వెళ్లి చూడగా బైక్‌పై 11 కలప చెక్కలు కనుగొన్నారు. కలప తోపాటు బైక్‌ని సీజ్ చేసి కేసు నమోదు చేశారు. ఈ కలప ఎవరు ఎక్కడ నుంచి తీసుకువస్తున్నారు. ఎక్కడకు తరలిస్తారనే విషయాలు తెలుసుకునేందుకు దర్యాప్తు జరుపుతామని అటవీ విభాగ అధికారి సంధీప్ కుమార్ పాణిగ్రహి వెల్లడించారు. సీజ్ చేసిన కలప, బైక్‌లను బొయిపరిగుడ అటవీ కార్యాలయానికి తీసుకు వచ్చినట్లు ఆయన వెల్లడించారు.


