నిరుద్యోగులకు టోపీ | - | Sakshi
Sakshi News home page

నిరుద్యోగులకు టోపీ

Aug 6 2026 1:09 AM | Updated on Aug 6 2026 1:09 AM

సోంపేట: సోంపేట పరిసర గ్రామాల నిరుద్యోగులకు పట్టణంలో వెలసిన ఓ ప్రైవేటు శిక్షణ కేంద్రం కుచ్చుటోపీ పెట్టింది. నిరుద్యోగులు ఉద్యోగాలు సాధించడానికి శిక్షణ అందజేస్తామ ని నమ్మబలికి సోంపేటలో ఆరు నెలల కిందట బస్టాండు సమీపంలో శిక్షణ కేంద్రాన్ని ఏర్పా టు చేశారు. శిక్షణ కేంద్రంలో వందలాది మంది విద్యార్థులను చేర్చుకున్నారు. రైల్వే, బ్యాంక్‌, డీఎస్సీ, ఉద్యోగాలతో పాటు ఎంసెట్‌ ర్యాంకులు ఇప్పిస్తామని నమ్మబలికారు. ఉద్యోగం ఇచ్చేవరకు శిక్షణ అందజేస్తామని చెప్పి నిరుద్యోగుల వద్ద లక్షల రూపాయలు ఫీజు వసూ లు చేశాడు. అలాగే పట్టణంలో పలు దుకాణాల్లో మౌలిక వసతుల కోసం పలు వస్తువులు, కిరాణా తెచ్చి వారికి నగదు ఇవ్వకుండా బోర్డు తిప్పినట్లు తెలుస్తుంది. రాత్రికి రాత్రి శిక్షణ కేంద్రానికి తాళాలు వేయడంతో శిక్షణకు ఫీజులు కట్టిన విద్యార్థులు, నిరుద్యోగులు ల బోదిబోమంటున్నారు. సుమారు కోటి రూపాయలు వరకు నిరుద్యోగులు, విద్యార్థుల నుంచి ఫీజులు వసూలు చేసినట్లు తెలుస్తోంది.

మెయిన్‌ డ్రాప్‌ కూల్చివేతపై రైతుల ఆందోళన

సంతబొమ్మాళి: పాలతలగాం వద్ద వంశధార కాలువలో వేసిన మెయిన్‌డ్రాప్‌ పిల్లర్‌ కూల్చివేతపై రైతులు బుధవారం ఆందోళన వ్యక్తం చేశారు. మెయిన్‌డ్రాప్‌ పిల్లర్‌ కూల్చివేయడంతో సాగునీరు ఈ ప్రాంతానికి అందదని, సు మారు 1500 ఎకరాలు ప్రశ్నార్థకంగా మారిందని రైతులు అంటున్నారు. గతంలో వంశధార అధికారులే డ్రాప్‌ను ఏర్పాటు చేసి ఇప్పుడు అ అధికారులే కూల్చివేయడం ఎంతవరకు సమంజసమని రైతులు ప్రశ్నిస్తున్నారు. దీనిపై ఉన్నతాధికారులు స్పందించాలని పలువురు రైతులు కోరుతున్నారు. దీనిపై వంశధార జేఈ అప్పలరెడ్డిని సంప్రదించగా.. మెయిన్‌ డ్రాప్‌ వల్ల దిగువన ఉన్న వేల ఎకరాలకు సాగునీరు అందని పరిస్థితి ఉందని, దీంతో కూల్చేశామని తెలిపారు.

‘డ్రగ్స్‌ నియంత్రణకు

యుద్ధానికి సిద్ధం’

అరసవల్లి: బంగారు భవిష్యత్‌ను అంధకారంలో పడేస్తున్న డ్రగ్స్‌ నిర్మూలనపై యువతే ముందడుగు వేసి యుద్ధానికి సిద్ధం కావాలని జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ ఫర్మాన్‌ అహ్మద్‌ ఖాన్‌ పిలుపునిచ్చారు. బుధవారం స్థానిక ప్రభుత్వ మహిళా కళాశాలలో మై భారత్‌ కేంద్ర ఆధ్వర్యంలో నిర్వహించిన నషా ముక్త్‌ యువ ఫర్‌ వికసిత్‌ భారత్‌ కార్యక్రమంలో పాల్గొన్న ఆయ న మాట్లాడుతూ 2047 నాటికి వికసిత్‌ భారత్‌ లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం నషా ముక్త్‌ వికాస్‌ పేరిట ప్రత్యేక కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా నిర్వహిస్తుందని వివరించారు. డ్రగ్స్‌ వినియోగిస్తూ ఎందరో అమాయక యువకులు తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారని, విద్యార్థి దశ నుంచే డ్రగ్స్‌ వినియోగంతో కలిగే అనర్థాలను తెలిసేలా అవగాహన కలిగించేలా చర్యలు చేపట్టాలన్నారు. అనంతరం మత్తు పదార్థాల నియంత్రణ–యువత పాత్రపై జిల్లా స్థాయి పోటీలను ఆయన ప్రారంభించారు. పోటీల అనంతరం విజేతలకు ముఖ్య అతిథులుగా విచ్చేసిన జిల్లా ఉపాధి కల్పనాధికారి కె.సుధ, డీఎల్‌డీఓ భాస్కరరావు, సెట్‌శ్రీ సీఈ ఓ అప్పలనాయుడు, ప్రభుత్వ మహిళా కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ కె.సూర్యచంద్రరావు తదితరులు బహుమతులు ప్రదానం చేశారు.

ఆమదాలవలసలో

లాయర్ల విధుల బహిష్కరణ

ఆమదాలవలస: గత నెల 30వ తేదీన ఉదయం పది గంటల నుంచి మధ్యాహ్నం 2.30 వరకు ఆమదాలవలస జూనియర్‌ సివిల్‌ జడ్జి కోర్టులో విధుల్లో ఉన్న బార్‌ అసోసియేషన్‌ సభ్యు లు, లాయర్‌ దానేటి రామ్మోహన్‌రావును క్రైమ్‌ నంబర్‌ 117/2026 లో నిందితుడిగా ఎ–8 గా చేర్చడం సరికాదని ఆమదాలవలస బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షురాలు కణితి విజయలక్ష్మిబాయి తోపాటు బార్‌ అసోసియేషన్‌ సభ్యులు, కార్యవర్గ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. దీనికి నిరసనగా బుధవారం కోర్టు విధులను బహిష్కరించారు. వైఎస్‌ జగన్‌ జిల్లా పర్యటనలో మహిళా ఎస్‌ఐపై అస భ్యంగా ప్రవర్తించిన ఆరోపణలపై కేసు నమోదు చేశారని గుర్తు చేశారు. ఆయన ఆ సమయంలో కోర్టు విధుల్లో ఉండడాన్ని అందరం గమనించామన్నారు. అందుకే విధులు బహిష్కరించి నిరసన తెలుపుతున్నామని పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement