గజపతి కలెక్టరేట్‌ సందర్శన | - | Sakshi
Sakshi News home page

గజపతి కలెక్టరేట్‌ సందర్శన

Aug 6 2026 1:09 AM | Updated on Aug 6 2026 1:09 AM

పర్లాకిమిడి: గజపతి కలెక్టరేట్‌ను భువనేశ్వర్‌ నుంచి అసిస్టెంట్‌ సెక్షన్‌ అధికారుల బృందం సందర్శించింది. తొలుత కలెక్టర్‌ కార్యాలయంలో ఏడీఎం మునీంద్ర హానగ అధ్యక్షతన జరిగిన అధికారుల సమావేశంలో పాల్గొన్నారు. ఈ సమావేశంలో డిప్యూటీ కలెక్టర్‌ బినాయక్‌ రౌళో, కలెక్టర్‌ జగన్నాథ పాఢి తదితరులు పాల్గొన్నారు. కలెక్టరేట్‌ అసిస్టెంట్‌ సెక్షన్‌ అధికారులకు పరిపాలన విభాగంలో వివిధ సెక్షన్లలో సిబ్బందితో ఎలా పని చేయించాలి, వారి విధులు, కంప్యూటర్‌లో పరిజ్ఞానం, ఫైల్స్‌ నిర్వహణ పై ప్రత్యేక కర్మశాలను నిర్వహించారు. అనంతరం 50 మంది అధికారుల బృందం ప్రత్యేక బస్సులో బి.ఎన్‌.ప్యాలస్‌, గజపతి ప్యాలస్‌, శ్రీజగన్నాథ మందిరాన్ని సందర్శించారు. కొత్తగా ప్రొమోషన్‌ పొందిన ఈ అసిస్టెంటు సెక్షన్‌ అధికారులు పలు జిల్లాల్లో కలెక్టరేట్‌లు పర్యటించి క్షేత్రస్థాయిలో ప్రభుత్వ కార్యకలాపాలు అధ్యయనం చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement