● ఫోన్లు అప్పగింత | - | Sakshi
Sakshi News home page

● ఫోన్లు అప్పగింత

Aug 6 2026 1:09 AM | Updated on Aug 6 2026 1:09 AM

రాయగడ: పోయిన, చోరీకి గురైన ఫోన్లను గుర్తించి యజమానులకు తిరిగి అందజేసే కార్యక్రమంలో భాగంగా ఝార్సుగుడ జిల్లా పోలీసులు బుధవారం జిల్లా పోలీస్‌ కార్యాలయంలో మొబైల్‌ హ్యాండోవర్‌ మేళా నిర్వహించారు. జిల్లా ఎస్పీ జి.ఆర్‌.రాఘవేంద్ర ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో మొత్తం 89 ఫోన్లను వాటి యజమానులకు అందజేశారు. ఝార్సుగుడ సైబర్‌ సెల్‌తోపాటు జిల్లా వ్యాప్తంగా వివిధ పోలీస్‌ స్టేషన్లలో సమన్వయంతో సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి ఫోన్లను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. పోలీస్‌ స్టేషన్ల వారిగా స్వాధీనం చేసుకున్న పోన్లలో ఝార్సుగుడ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని అత్యధికంగా 29, బడ్మాల్‌లో 11, బెల్‌పహార్‌ పాళీలో 7, బ్రజరాజ్‌నగర్‌, సదర్‌, మణ్‌పూర్‌, సిసి అండ్‌ ఈఓ పోలీస్‌ స్టేషన్లలో చెరో 6, ఓరియంట్‌లో 5, లైకేరా, కొలాంబిరాలో చెరో 4, రెంగాలిలో 3, ఎయిర్‌పోర్టు, బెల్‌పహార్‌లో చెరో ఒఓ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నట్లు ఎప్పీ తెలిపారు. ఫోన్లు పోయినా, చోరీకి గురైన వెంటనే సమీప పోలీస్‌ స్టేషన్లలో ఫిర్యాదు చేయాలన్నారు. సీఈఐఆర్‌ పోర్టల్‌ ద్వారా ఫిర్యాదును నమోదు చేసుకోవాలని సూచించారు. ఇప్పటివరకు ఝార్సుగుడ పోలీసులు ఐదు విడతల్లో నిర్వహించిన మొబైల్‌ మేళాల ద్వారా మొత్తం 413 ఫోన్లను గుర్తించి వాటిని యజమానులకు అందజేశామని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement