రెవెన్యూ శాఖలో అలజడి | - | Sakshi
Sakshi News home page

రెవెన్యూ శాఖలో అలజడి

Aug 6 2026 1:09 AM | Updated on Aug 6 2026 1:09 AM

నరసన్నపేటలో భూ ఆక్రమణలపై 19 మంది ప్రభుత్వ సిబ్బందిపై చర్యలకు ఉత్తర్వులు

నరసన్నపేట: నరసన్నపేటలో ఆక్రమణలతో సంబంధం ఉన్న ఏడుగురు తహసీల్దార్లు, 12 మంది వీఆర్వోలపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి సాయి ప్రసాద్‌ ఉత్తర్వులు జారీ చేశారు. ఆయా ఉద్యోగులపై చర్య లు తీసుకోవడానికి కలెక్టర్‌ ఆధ్వర్యంలో రెవె న్యూ శాఖ సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఏడుగురు తహసీల్దార్లలో కె.ప్రవళ్లిక ప్రియ, యూవీ రమణ, ఎం.సురేష్‌ కుమార్‌, పొదిలాపు శ్రీనివాసరావు, ఎస్‌.సుధాసాగర్‌, జల్లేపల్లి రామారావు, వై.శ్రీనివాసరావు ఉన్నారు. అలాగే 12 మంది వీఆర్వోలు జ్ఞానేశ్వరరావు, కోటేశ్వరరావు, జెల్ల శ్రీనివాసరావు, లుకలాపు శ్రీనివాసరావు, ఎం. శ్రీనివాసరావు, ఎం.సంధ్య, టి.లక్ష్మణరావు, చౌ దరి చక్రవర్తి, మురళీ కృష్ణం నాయుడు, శ్యామ్‌, చిన్న వెంకటరావు ఉన్నారు. ప్రధాన కార్యదర్శి ఆదేశాల మేరకు వీరికి షోకాజ్‌ నోటీసులు సిద్ధం అవుతున్నట్లు సమాచారం. 2009 నుంచి జరిగి న ఆక్రమణలపై 2018లో నివేదిక ప్రభుత్వానికి ఇవ్వగా ఇప్పుడు చర్యలు తీసుకుంటున్నారు. అప్పటి తహసీల్దార్లలో ఒకరు పదవీ విరమణ పొందగా ఒకరు ఆర్డీఓ స్థాయి అధికారిగా ఉన్నారు. వీఆర్వోల్లో ఒకరిద్దరు పదవీ విరమణ పొందగా మి గిలిన వారు వివిధ హోదాల్లో పనిచేస్తున్నారు. ఉత్తర్వులతో రెవెన్యూ యంత్రాంగం ఉలిక్కిపడింది.

రైల్వేట్రాక్‌పై భారీ సర్పం

కంచిలి: జాడుపూడి గ్రామం సమీపంలో రైల్వేట్రాక్‌ మధ్యలో బుధవారం ఉదయం భారీ సర్పం అక్కడ పనులు చేస్తున్న ట్రాక్‌మ్యాన్‌ దృష్టిలో పడింది. సుమారు పది అడుగులు ఉండే పాము హఠాత్తుగా ట్రాక్‌ వద్ద కనబడటంతో ట్రాక్‌మ్యాన్‌ ఆశ్చర్యానికి గురయ్యాడు. ఆ సర్పాన్ని తన మొబైల్‌ ఫోన్‌ కెమెరాలో బంధించాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement