న్యూస్‌రీల్
జూనియర్లపై సీనియర్ల దాడి రివల్‌కోన హైస్కూల్‌లో జూనియర్లపై సీనియర్లు దాడి చేశారు. ఇది సంచలనం రేకెత్తించింది. –8లోu
శ్రీమందిరం ఆదాయం లెక్కింపు
భువనేశ్వర్: పూరీ జగన్నాథాలయం హుండీలో భక్తులు కానుకల రూపంలో సమర్పించిన ఆదాయాన్ని పాలకవర్గం మంగళవారం లెక్కించారు. ఇందులో నగదు రూ.3,83,480లు, బంగారం 680 మిల్లీగ్రాములు, వెండి 51 గ్రాములు వచ్చాయని అధికారులు తెలిపారు.
బుధవారం శ్రీ 5 శ్రీ ఆగస్టు శ్రీ 2026
పర్లాకిమిడి:
రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము గంజాం జిల్లాలో రెండురోజుల పర్యటనకు మంగళవారం విచ్చేశారు. రాష్ట్రపతి ఉదయం 11.10 గంటలకు బరంపురం రైల్వే స్టేషన్‌కు చేరుకోగా గవర్నర్ డాక్టర్ హరిబాబు కంభంపాటి, ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మఝి ఘనస్వాగతం పలికారు. వారితో పాటు రాష్ట్ర ఉక్కు, రవాణా శాఖ మంత్రి బిభూతీ భూషణ్ జెన్నా, రాష్ట్ర మత్స్య, పశుసంవర్ధక శాఖ మంత్రి గోకులానంద మల్లిక్, ఎంపీ ప్రదీప్ కుమార్ పాణిగ్రాహి, బరంపురం ఎమ్మెల్యే కె.అనిల్‌కుమార్, దక్షిణ మండళం ఆర్‌డీసీ సంగ్రాంకేసరి మహాపాత్రో, సదరన్ రేంజ్ ఐ.జీ (పోలీసు) నితిశేఖర్, గంజాం కలెక్టర్ వి.కార్తివాసన్, బరంపురం ఎస్పీ డాక్టర్ శరవణ వివేక్ తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. పులి వేషం, గిరిజన నృత్యాలు, సంకీర్తనలు, జానపద నృత్యాలతో రాష్ట్రపతికి స్వాగతం పలికారు. అనంతరం రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము గంజాం, గజపతి జిల్లాలో సరిహద్దులో ఉన్న ఆధ్యాత్మిక ప్రాంతం తప్తపాణికి బయల్దేరారు.
ప్రత్యేక పూజలు
వేడినీటి బుడగలో ఉన్న మాకందునీ దేవి పీఠం ఒక పవిత్ర క్షేత్రం. శ్రావణమాసంలో ఈ క్షేత్రాన్ని సందర్శించిన తొలి భారత రాష్ట్రపతిగా ద్రౌపతి ముర్ము చరిత్రలో నిలిచి పోతారని ప్రధాన పూజారి ప్రశాంత్ కుమార్‌జానీ విలేకరులతో అన్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ఆలయ ప్రధాన పూజారి ఘనంగా స్వాగతం పలికారు. తప్తపాణిలో మాకందునీ దేవికి రాష్ట్రపతి చేతుల మీదుగా ప్రత్యేక పూజలు చేయించారు. ఆమె సమీపంలోని మహాదేవ ఆలయాన్ని కూడా సందర్శించి పవిత్ర హారతి కార్యక్రమంలో పాల్గొన్నారు. తప్తపాణికి దారి పొడవునా వివిధ పాఠశాలల విద్యార్థులు, ప్రజలకు అభివాదం తెలుపడమే కాకుండా మీనాక్షినగర్ (బరంపురం) వద్ద చిన్నారులకు చాక్లెట్లు పంచిపెట్టి, సెల్ఫీలు దిగారు. రాష్ట్రపతికి ఎస్కార్టుగా ప్రత్యేక సెక్యూరిటీ, గవర్నరు పేషీ, ముఖ్యమంత్రి, మంత్రులు, కలెక్టర్, ఎస్పీ ఇతర అధికారుల కార్లు తప్తపాణికి చేరుకున్నాయి.


