సెంచూరియన్‌లో ‘తేజాస్‌’ | - | Sakshi
Sakshi News home page

సెంచూరియన్‌లో ‘తేజాస్‌’

Aug 5 2026 2:29 AM | Updated on Aug 5 2026 2:29 AM

సెంచూరియన్‌లో ‘తేజాస్‌’

పర్లాకిమిడి: ఒడిశా స్టార్టప్స్‌ను ప్రారంభించడానికి అన్ని సౌకర్యాలు కల్పిస్తున్న అనువైన రాష్ట్రంగా ఉందని ఎమ్మెల్యే రూపేష్‌ పాణిగ్రాహి అన్నారు. ఆయన ఆర్‌.సీతాపురంలో సెంచూరియన్‌ వర్సిటీలో తేజాస్‌ (ట్రాన్స్‌ఫార్మింగ్‌ ఎంటర్‌ప్రెన్యూర్స్‌ జర్నీ ఎక్రాస్‌ స్టేట్స్‌ మరియు జిల్లాలు)ను కార్యక్రమాన్ని ముఖ్యఅతిథిగా విచ్చేసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో డీపీఐఐటీ సీఈఓ స్మృతి రంజన్‌ప్రధాన్‌, మోహన ఎమ్మెల్యే దాశరథి గోమాంగో, కలెక్టర్‌ అక్షయ సునీల్‌ అగర్వాల్‌, జిల్లా పరిషత్తు అధ్యక్షులు గవర తిరుపతి రావు, పురపాలక శాఖ చైర్మన్‌ నిర్మలా శెఠి, సెంచూరియన్‌ వర్సిటీ ప్రోవీసీ అజయ్‌కుమార్‌ నాయక్‌, రిజిస్ట్రార్‌ డాక్టర్‌ అనిత పాత్రో, డైరెక్టర్‌ దుర్గాప్రసాద్‌ పాడి తదితరులు పాల్గొన్నారు. యువ పారిశ్రామిక వేత్తలు గురించి రూపేష్‌ పాణిగ్రాహి మాట్లాడుతూ, యువత ఆత్మనిర్భర్‌ భారత్‌ సాధనకు మూలాధారం తేజాస్‌ అని అన్నారు. యువత ప్రభుత్వ ఉద్యోగం కోసం ఆశించకుండా ప్రతి ఒక్కరూ మెంటర్‌షిప్‌, దక్షత, మార్కెటింగ్‌ లింక్‌, ప్రభుత్వ సబ్సిడీల వినియోగించుకుని కొత్త స్టార్టప్‌లు ప్రారంభించాలని సూచించారు. ప్రభుత్వం నిరుద్యోగ యువతీ యువకుల కోసం బ్యాంకు రుణాలు అందిస్తుందని, ప్రతి చదువుకున్న విద్యార్థి పరిశ్రమలు, స్టార్టప్స్‌ ప్రారంభించడానికి ముందుకు రావాలని కోరారు. అనంతరం ఎమ్మెల్యే రూపేష్‌ పాణిగ్రాహి, సీఈఓ స్మృతిరంజన్‌ ప్రధాన్‌కు జ్ఞాపికతో విశ్వవిద్యాలయం వైస్‌ చాన్స్‌లర్‌ అజయ్‌కుమార్‌ నాయక్‌ సత్కరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement