కొరాపుట్: ఆంధ్రా–ఒడిశా సరిహద్దులో గుర్తు తెలియని వ్యక్తి ఆకస్మికంగా మృతి చెందారు. కొరాపుట్ జిల్లా నందపూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో కుమార గంధాన గ్రామ పంచాయతీలో కిరండోల్–కొత్తవలస రైల్వే లైన్‌లో పలిబా రైల్వేస్టేషన్ వెలుపల గుర్తు తెలియని వ్యక్తి (60) చనిపోయారు. మూడు రోజులుగా రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాల్లో సంచరిస్తూ రాత్రి పూట రైల్వేస్టేషన్‌లో నిద్రిస్తున్నాడు. స్టేషన్ బయట సంచరిస్తున్నప్పుడు ఒక్కసారిగా రక్తం కక్కుకుంటూ కుప్పకూలిపోయాడు. ఇది చూసిన స్థానికులు 108 కి ఫోన్ చేయగా అంబులైన్స్‌లో నందపూర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరిక్షీంచిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్టు నిర్ధారించారు. మృతదేహాన్ని కొరాపుట్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ సాహిద్ లక్ష్మణ్ నాయక్ వైద్య కళాశాలకి తరలించారు. నందపూర్ పోలీసులు కేసు నమెదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


