జయపురం: స్థానిక విక్రమదేవ్ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో యూనివర్సిటీ ఎల్–2 సభాగృహంలో ‘మత్తు లేని యువత, భారత్ అభివృద్ధి సంకల్ప అభిజాన్’ కార్యక్రమంలో భాగంగా ప్రతిజ్ఞ చేశారు. విశ్వవిద్యాలయ కులపతి ప్రొఫెసర్ హృషికేష్ శనాపతి, సీపీజీసీ డాక్టర్ ప్రశాంత కుమార్ పాత్రో అతిథిలుగా హాజరయ్యారు. మత్తు లేని సమాజం, అభివృద్ధి చెందిన భారత్ నిర్మాణంలో యువత భూమికపై ప్రసంగించారు.
కులపతి ప్రొఫెసర్ శనాపతి మాట్లాడుతూ.. యువత, విద్యార్థులు మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలన్నారు. డాక్టర్ ప్రశాంత్ కుమార్ పాత్రో మాట్లాడుతూ.. మత్తు పదార్థాలకు అలవాటు పడితే జీవితాలు నాశనమవుతాయన్నారు. ఎన్‌సీసీ, ఎన్‌ఎస్‌ఎస్, వైఆర్‌సీ విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.


