భువనేశ్వర్: భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 3 రోజుల రాష్ట్ర పర్యటనలో భాగంగా మంగళవారం లోక్ భవన్ నుంచి బరంపురానికి బయలుదేరారు. ఈ సందర్భంగా గవర్నర్ డాక్టర్ హరిబాబు కంభంపాటి, జయశ్రీ కంభంపాటి దంపతులు రాష్ట్రపతిని ఆడపడుచు లాంఛనాలతో సాదరంగా సత్కరించారు. జీఐ ట్యాగ్ పొందిన సంబల్‌పురి సంప్రదాయ చేనేత చీర, ప్రసిద్ధ పిప్పిలి ఆప్లిక్ ఉత్తరీయం, ఆకట్టుకునే కటక్ సిల్వర్ ఫిలిగ్రీ గణేష్ ప్రతిమని కానుకగా సమర్పించి ఆత్మీయత పంచుకున్నారు. గవర్నర్ దంపతుల ఆత్మీయత పట్ల భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆనందం వ్యక్తం చేశారు.


