నూతన కార్యవర్గం | - | Sakshi
Sakshi News home page

నూతన కార్యవర్గం

Aug 4 2026 1:53 AM | Updated on Aug 4 2026 1:53 AM

నూతన కార్యవర్గం ఘనంగా ప్రపంచ వాణిజ్య దినోత్సవం

రాయగడ: ఉత్కళాంధ్ర బ్రాహ్మణ సేవా సమాజానికి కొత్త కార్యవర్గం ఏర్పాటైంది. సంఘం అధ్యక్షుడిగా సీనియర్‌ సభ్యులు మట్నూరు శ్రీనివాస్‌ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆదివా రం రాత్రి స్థానిక రామలింగేశ్వర మందిరం ప్రాంగణంలో జరిగిన సర్వసభ్య సమావేశంలో ఈ మేరకు కొత్త కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. సంఘం ఉపాధ్యక్షుడిగా అవసరాల సత్యనారాయణమూర్తి, కార్యదర్శి బుర్రా శ్రీనివాస్‌ రావు, కొశాధికారిగా ముట్నూరు రామగొపాల్‌, సహా య కార్యదర్శిగా కర్నా వేణుగొపాల్‌ ఏకగ్రీవంగా ఎన్నికై నట్లు సీనియర్‌ న్యాయవాది సంస్థ న్యాయ సలహాదారుడు వి.ఎస్‌.ఎన్‌.రాజు ఆధ్వర్యంలో జరిగిన ఎన్నికల్లో కార్యవర్గం సభ్యుల వివరాలను వెల్లడించారు. సంఘం సలహాదారుడిగా రేజేటి శ్రీనివాస్‌ శర్మ, తెన్నేటి శ్రీరామ్మూర్తి, మాజీ కార్యదర్శి భళ్లమూడి నాగ రాజు సభా నిర్వహణ చేశారు. సభ్యులు హాజరయ్యారు. ప్రతీ రెండేళ్లకొసారి ఈ కార్యవర్గం ఎన్నికల జరగనున్నట్లు న్యాయ సలహాదారు డు, న్యాయవాది రాజు తెలియజేశారు.

మల్కన్‌గిరి: మల్కన్‌గిరి జిల్లా కేంద్రంలో ఉన్న మల్కన్‌గిరి కళాశాల వాణిజ్య విభాగం ఆధ్వ ర్యంలో ప్రపంచ వాణిజ్య దినోత్సవాన్ని సోమ వారం ఘనంగా నిర్వహించారు. కళాశాల ప్రిన్సిపాల్‌ చిత్తరంజన్‌ బారిక్‌, జిల్లా వ్యాపార సంఘ అధ్యక్షుడు సురేష్‌ సోమాని ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ముఖ్య వక్తగా స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా మల్కన్‌గిరి శాఖ మేనే జర్‌ వినోద్‌కుమార్‌ బిశోయి మాట్లాడారు. బ్యాంకింగ్‌ వ్యవస్థకు వాణిజ్య రంగంతో విడదీయరాని సంబంధం ఉందన్నారు. ఈ సందర్భంగా అతిథులు మాట్లాడుతూ.. ప్రతీసంవత్సరం ఆగస్టులో తొలి సోమవారం వాణిజ్య దినోత్సవంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. వాణిజ్య రంగంలో పనిచేస్తున్న అధికారులు, ఉద్యోగులను గౌరవించడం జరుగుతుందన్నా రు. ఆర్థిక వ్యవస్థను మరింత బలోపేతం చేయడం, వాణిజ్య అభివృద్ధిని కార్యక్రమంలో వివరించారు. ఈ కర్యక్రమంలో ఇప్సితా దాస్‌, దీప్తిరేఖ మిశ్రో, మానాస్‌ కుమార్‌ పాడీ, వాణిజ్య విభాగ విద్యార్థులు పాల్గొన్నారు.

పోరాటాలకు సిద్ధమవ్వండి

నందిగాం: ఆఫ్‌షోర్‌ రిజర్వాయర్‌ కోసం సమరశీల పోరాటాలకు సన్నద్ధమవ్వాలని సీపీఎం జిల్లా కార్యదర్శి డి.గోవిందరావు, కార్యవర్గ సభ్యుడు కోనారి మోహనరావు, జిల్లా కమిటీ సభ్యుడు పి.ప్రసాద్‌, నంబూరు షణ్ముఖరావులు పిలుపునిచ్చారు. సోమవారం సీపీఎం పార్టీ, ఆఫ్‌షోర్‌ రిజర్వాయర్‌ సాధన పోరాట కమిటీ ప్రతినిధుల బృందం మండలంలోని పెద్దలవునిపల్లి, కంచిఊరు, కామధేనువు గ్రామాల్లో పాదయాత్ర చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్నికల ముందు పెండింగ్‌ ప్రాజెక్టులు పూర్తి చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం, ఎందుకు ఆఫ్‌షోర్‌కు నిధులు మంజూరు చేయడం లేదని ప్రశ్నించారు. ఈ నియోజకవర్గ ఎమ్మెల్యే, మంత్రి అచ్చెన్నాయుడు నిధులు విడుదల చేయించడంలో విఫలం అవుతున్నారని ఆరోపించారు. అచ్చెన్నాయుడికి రైతాంగంపై చిత్తశుద్ధి ఉంటే వెంటనే నిధులు మంజూరు చేయించి పనులు పూర్తి చేయించాలని డిమాండ్‌ చేశారు. పాదయాత్రలో ఆఫ్‌షోర్‌ రిజర్వాయర్‌ సాధన పోరాట కమిటీ సభ్యులు పి.ధర్మారావు, వజ్జ సింహాచలం, పిన్నింటి కృష్ణమూర్తి, సాయి, కణితి ధీనబందు, పాపారావు, కిల్లి దుర్వాసులు, వజ్జ విద్యాసాగర్‌, పినకాన తులసయ్య, సీపీఏం నాయకులు కొల్లి ఎల్లయ్య, హనుమంతు ఈశ్వరరావు, పాలిన సాంబమూర్తి, బగాది వాసుదేవరావు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement