పర్లాకిమిడి: జిల్లా కలెక్టరేట్‌లో సోమవారం జాయింట్ గ్రీవెన్స్ సెల్‌కు వినతులు వెల్లువెత్తాయి. జిల్లా కలెక్టర్ అక్షయ సునీల్ అగర్వాల్, ఏడీఎం మునీంద్ర హానగ, అదనపు ఎస్పీ బిరంచి బేగ్, తదితరులు హాజరయ్యారు. 150 వినతులు అందాయి. వీటిలో గ్రామ సమస్యలకు సంబంధించినవి 16, వ్యక్తిగతం 134 ఉన్నాయి. ఇద్దరు దివ్యాంగులకు జిల్లా సామాజిక, దివ్యాంగుల స్వశక్తీకరణ విభాగం అధికారులు ల్యాప్‌టాప్‌లు కలెక్టర్ ద్వారా అందజేశా రు. సీడీఎంఓ డాక్టర్ మంజురాణి జెన్నా, గుసాని బీ డీఓ గౌరచంద్ర పట్నాయక్, పలువురు అధికారులు పాల్గొన్నారు.
36 వినతుల స్వీకరణ..
మల్కన్‌గిరి: జిల్లాలోని కలిమెల సమితి తెల్‌రాయి పంచాయతీలో సోమవారం జిల్లా కలెక్టర్ ప్రధమేశ అర్వింద్ ఆధ్వర్యంలో గ్రీవెన్స్ నిర్వహించారు. కలిమెల సమితి పరిసర ప్రాంతాలు నుంచి 36 వినతు లు అందాయి. 13 వ్యక్తిగత వినతులు, 23 సామూహిక వినతులున్నాయి. వీటిలోని పలు సమస్యలను గ్రీవెన్స్‌లోనే కలెక్టర్ పరిష్కరించారు. మరికొన్ని సమస్యలను పరిష్కరించాలని ఆయా శాఖల అధికారులకు ఆదేశించారు. నిశా ముక్త్ భారత్ అభియా న్ కోసం సామూహిక ప్రతిజ్ఞ నిర్వహించారు. ఎస్పీ వినోద్ పటేల్, జిల్లా అటవిశాఖ అధికారి సాయికిరణ్, జిల్లా సబ్ కలెక్టర్ దూర్యోధన్ బోయి, జిల్లా అభివృద్ధిశాఖ అధికారి దశరథి సరాబు, అధికారులు పాల్గొన్నారు.


